Thursday, January 23, 2025

ఆర్య నాగరికత

- Advertisement -
- Advertisement -

General science questions and answers in telugu

వేదాలు..
వేదాలను అపౌరుషేయాలు, నిత్య, శృతులు, సంహితాలు అని కూడా అంటారు. వేదము విద్ అనే సంస్కృత భాషా పదం నుంచి ఆవిర్భవించింది. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థం. అపౌరుషేయాలు అనగా మానవుల చేత రచించబడనివి అని అర్థం. వేదాలు 4, సంస్కృత భాషలో రాయబడినవి. వీటిని వ్యాసుడు సంకలనం చేశాడు. ఇతడిని వేద వ్యాసుడని అంటారు.

ఆర్యనాగరికతనే వైదిక నాగరికత అని అంటారు.
ఇది క్రీ.పూ. 1500 600 కాలంలో వర్ధిల్లింది.
ఆధారాలు: వేదాలు, నాణెములు, శాసనాలు.
1786లో ఆర్యుల జన్మస్థానం గురించి సర్ విలియం జోన్స్ ప్రాస్తావించాడు.
1784 జనవరి 15న కలకత్తాలో విలియం జోన్స్ ఆసియాటిక్ సొసైటీని స్థాపించారు.
ఆర్యులు నోర్డిక్ జాతికి చెందినవారు. ఆర్య అనే సంస్కృత పదానికి శ్రేష్టుడని అర్థం.
బోగజ్‌కాయ్ (కష్టి, మెట్టూరి) శాసనం ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్య అనే దేవతల గురించి వివరించింది.
ఆర్యులు భారతదేశంపై పశువుల కోసం, పశుగ్రాసం కోసం దండయాత్ర చేశారు.
గడ్డి మైదానాలపై ఉండే అధికారి
వజ్రపతి
మెలూహ (సప్త సింధు)అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సాంభార అనే సింధు తెగ నాయకుడిని ఓడించి దివదాసకుడు అనే ఆర్య తెగ నాయకుడు సింధునదీ పరిసర ప్రాంతాన్ని ఆక్రమించాడు.
దివదాసకుడి అనంతరం త్రిస్యదాసకుడు సింధు ప్రజలపై దండెత్తి అనేక మంది ధస్యులను హత్య చేసాడు.
అందుకే ఇతనిని ధాస్యహత్య అని పేర్కొంటారు.
ఆర్యుల కాలంలో పశువుల కోసం, పశుగ్రాసం కోసం జరిగిన యుద్ధాలను గవిస్థి/గవిసాన/గవ్యవత్ అనేవారు.
ఆర్యుల కాలంలో గోవులను దొంగిలించేవారిని పాణీలు పాలు పితికేవారిని దుహితి అనేవారు.
గ్రామాల సముదాయాన్ని విశ్ అనేవారు.
వైదిక నాగరికతను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
1. తొలి వేదకాల నాగరికత (క్రీ.పూ 1500 1000)
2. మలి వేదకాల నాగరికత (క్రీ.పూ 1000 600)
ఆర్య నాగరికతను సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, మత కారణాలు అనే నాలుగు అంశాల ఆధారంగా వర్గీకరించారు.
ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసింది వైదేహుడు
దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసింది అగస్తుడు
భరత వంశం, పురు వంశం వివాహ సంబంధాల ద్వారా ఏకమై నూతనంగా కురు అనే వంశాన్ని స్థాపించాయి.
వేదాలను 2 రాకాలుగా వర్గీకరిస్తారు. అవి 1. కర్మకాండ స్వర్గప్రాప్తికి సంబంధించినది. 2. జననకాండ శాశ్వతం కాని మానవ జన్మకు సంబంధించింది.
ప్రతీ వేదానికి 4 అనుబంధ గ్రంథాలున్నాయి.

 అవి. 1. సంహితాలు 2. అరణ్యకాలు 3. బ్రాహ్మణకాలు 4. ఉపనిషత్తులు
సంహితాలు: వేదాలలో గల శ్లోకాల సముదాయం. ఉదా. గాయత్రి మంత్రం.
అరణ్యకాలు : గురువులు, విద్యార్థుల మధ్య జరిగే చర్చల సారాంశం.
బ్రాహ్మణకాలు: పద్య రూపంలో ఉండే వేదాలను గద్యరూపంలోనికి మార్చే వాటిని బ్రాహ్మణకాలు అని అంటారు.
1. రుగ్వేదం ఆత్రేయ, కౌశాటక
2. సామవేదం చాందోగ్య
3. యజుర్వేదం శతపధి
4. అధర్వణ వేదం గోపధి
బ్రహ్మణాలన్నింటిలో కెల్లా అత్యంత ప్రాచీనమైంది. పెద్దది, ముఖ్యమైంది శతపధి

తొలి వేదకాలం
(క్రీ.పూ 1500 1000)
l ఈ నాగరికత గంగానదిని ఆధారంగా చేసుకుని ప్రారంభమైంది. పశువుల కోసం ఆర్య తెగల మధ్య జరిగిన గవిస్థి అనే యుద్ధాలు ఈ కాలంలోనే జరిగాయి.
l ఈ నాగరికత గంగానదిని ఆధారంగా చేసుకుని ప్రారంభమైంది.
l ఈ కాలంలో జరిగిన అతి ప్రధాన యుద్ధం దశరాజ గణ యుద్ధం
l క్రీ. పూ 1000లో రావి/పరుశుణి నదీ తీరంలో జరిగింది. ఇది త్రిస్యగణ, భరత వంశస్తుడైన సుధాముడు అనే చక్రవర్తికి, పురు వంశానికి చెందిన పురుకుచ్ఛ అనే చక్రవర్తుల మధ్య జరిగింది.
l సుధాముని ప్రధాన మంత్రి వశిష్టుడు
l పురుకుచ్ఛ ప్రధాన మంత్రి
విశ్వామిత్రుడు
l ఈ యుద్ధంలో విజయం సాధించింది
త్రిస్య గణానికి చెందిన ధాముడు.

రుగ్వేదం
l ఈ గ్రంథం జెండావెస్థా (ఇరాన్ గ్రంథం)ను పోలి ఉంటుంది. దీనిని స్రోత్ర వేదం అంటారు.
l వేదాలన్నింటిలో కెల్లా ప్రాచీనమైంది.
l భారతదేశంలో సంకలనం చేయబడిన తొలి గ్రంథం.
l దీనిలో 1028, శ్లోకాలు, 10 మండలాలు కలవు. ఈ శ్లోకాలన్నీ ప్రకృతి దేవతల ప్రార్థనలకు సంబంధించినవి.
l వీటిలో 2 నుండి 7 వమండలం వరకు సంకలనం చేయబడ్డాయి.
l 2 నుంచి 7 మండలాలను గోత్ర/వంశ మండలాలు అంటారు.
l మూడో మండలంలో గాయత్రీ మంత్రం గురించి పేర్కొనబడింది.
l ఈ మంత్రం సావిత్రి అనే దేవతతో పాటుగా సూర్యుడికి సంబంధించింది.
l 7వ మండలంలో దశరాజ గణ యుద్ధం గురించి పేర్కొన్నారు.
l 9వ మండలంలో సోముడు అనే దేవత గురించి ఉంది. ఇతడు వృక్షాలకు అధిపతి.
l పదో మండలంలో పురుషసూక్త కలదు.
l ఈ మండలంలోనే విశ్వజననం, వర్ణవ్యవస్థ గురించి పేర్కొనబడింది.
l రుగ్వేదంలో దైవాలు 3 వర్గాలు. అవి
l 1. పృద్వీస్థాన పృద్వి, అగ్ని, సోమ, బృహస్పతి
l 2. అంతరిక్షస్థాన ఇంద్ర, రుద్ర, అపమ్నాపత్, వాయు
l 3. వైయు స్థాన ధ్యాయస్ (ఆకాశ దేవత), వరుణ, మిత్ర, సూర్య, సావిత్రి
l ఈ వేదకాలంలో 4కులాల గురించి వివరిస్తూ చాతుర్వర్ణ వ్యవస్థను పేర్కొన్నారు.
l 1. బ్రాహ్మణ 2. క్షత్రియ 3. వైశ్య 4. శూద్ర
l పౌరోహిత్యం చేస్తూ గురువులూ, పురోహితులుగా పరిగణించబడేవారు
బ్రాహ్మణులు
l సమాజంలో నీతి నియమాలను కాపాడుతూ పరిపాలన చేసే వారు
క్షత్రియులు
l వర్తక వ్యాపారాలను నిర్వహిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేసేవారు
వైశ్యులు
l కాయకష్టం ప్రధాన వృత్తిగా కలిగినవారు శూద్రులు.
l ఈ వేదంలో మంత్రాలు చదివే వారిని హోత్రి అని అంటారు.
l నా తండ్రి బ్రాహ్మణుడు, తల్లి శూద్రురాలు, అన్న వైశ్యుడు, నేను క్షత్రియుడ్ని అనే శ్లోకం ఈ వేదంలోనే క లదు.

సామవేదం…

l ఈ వేదంలో మంత్రాలు చదివేవారిని ఉద్గటార్ అని అంటారు.
l సామవేదం అనే పదం సమన్ అనే పదం నుండి వచ్చింది.
l సమన్ అనగా శ్రావ్యమైన అని అర్థం
l ఈ వేదంలో శ్లోకాల సంఖ్య 1603, 75 శ్లోకాలు తప్ప మిగిలినవి రుగ్వేదం నుండి తీసుకున్నారు.
l అక్షరాస్యతకు సంబంధించి రుగ్వేదం నుంచి తీసుకున్న శ్లోకాల సముదాయం.
l శివుని ఢమరుకం నుంచి ఉద్భవించింది. ఈవేదంలో సంగీతం గురించి పేర్కొనబడింది.
l భారతీయ సంగీత మూల బీజాలు (సప్త స్వరాలు) ఈ వేదంలో ఉన్నాయి.

యజుర్వేదం:

l ఈ వేదంలో మంత్రాలు చదివేవారిని అధర్వా అని అంటారు.
l ఈ వేదంలో శ్లోకాల సంఖ్య 1836
l బలి ఇచ్చే సమయంలో పఠించాల్సిన మంత్రాలు ఈ వేదంలోనే ఉన్నాయి.
l ఇండో యూరోపియన్ల భాషలలో తొలి వచన గ్రంథం.
l పద్య రూపంలోనూ, గద్య రూపంలోనూ ఉండే ఏకైక వేదం. ఈ వేదం రెండు రకాలు. అవి
l 1. శుక్ల యజుర్వేదం (పద్యరూపం) 2. కృష్ణ యజుర్వేదం (గద్య రూపం)
l ఈ వేదంలోనే యజ్ఞయాగాలు, కర్మకాండలు గురించి పేర్కొనబడింది. యజ్ఞాలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు.
l 1. పితృ యజ్ఞం 2. మనుష్య యజ్ఞం 3. దేవతా యజ్ఞం 4. భూత యజ్ఞం 5. బ్రహ్మ యజ్ఞం.
l యాగాలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
l 1. రాజసూయయాగం
l 2.సోమయాగం అమృతం
l 3. వాజపేయయాగం
l 4. అశ్వమేథ యాగం
l 5. మహావ్రతయాగం

అధర్వణ వేదం:

l ఈ వేదంలో మంత్రాలు చదివే వారిని బ్రాహ్మణ అని అంటారు.
l ఆర్యేతరుల కాలంలో సంకలనం చేయబడిన వేదం.
l వైద్యం గురించి, వ్యవసాయ కార్యకలాపాల గురించి, గోత్రం గురించి, మంత్ర తంత్రం గురించి ఈ వేదంలోనే పేర్కొనబడింది.
l తొలి వేదకాలంలో చక్రవర్తి అధికారాన్ని నియంత్రించడానికి సభ సమితి అనే కవలలను ఈ వేదంలోనే పేర్కొన్నారు. దీనినే దయ్యాల శాస్త్రం అని అంటారు.

-సత్యనారాయణ
ఎకెఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News