Sunday, December 22, 2024

వైజాగ్‌ లో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి వేదాంత వీజీసీబీ మద్దతు

- Advertisement -
- Advertisement -

Vedanta VGCB Support to School development in Vizag

వైజాగ్‌: తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో భాగంగా, వేదాంత యొక్క వీజీజీసీ ఇప్పుడు విశాఖపట్నంలోని క్వీన్‌ మేరీస్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి తోడ్పాటునందించింది. వేదాంత యొక్క వీజీసీబీ 9 కంప్యూటర్లను పాఠశాలకు అందించడంతో పాటుగా కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది. దీనితో పాటుగా విద్యార్థులందరికీ కంప్యూటర్‌ శిక్షణను అందించేందుకు శిక్షకుడిని సైతం నియమించింది. అంతేకాదు, ఈ కంపెనీ ఇప్పుడు సౌర విద్యుత్‌ వ్యవస్థను సైతం పాఠశాలలో ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలకు తగిన మద్దతునందిస్తుంది. ఈ సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ద్వారా పాఠశాలకు అవసరమైన విద్యుత్‌ అవసరాలను గ్రీన్‌ ఎనర్జీ వనరు– సౌర శక్తి ద్వారా తీర్చనున్నారు. వేదాంత యొక్క వీజీసీబీ చేసిన ఈ పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటుగా లాంఛనంగా పాఠశాల అధికారులకు చైతన్య స్రవంతి ఫౌండింగ్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ షిరిన్‌ రెహమాన్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైజాగ్‌ మండల విద్యాశాఖాధికారి కొర్ర సువర్ణ ; వైఎస్‌ఆర్‌సీపీ వార్డ్‌ ప్రెసిడెంట్‌ సురాడ తాతారావు ; ఫిషర్‌మెన్‌ కమ్యూనిటీ లీడర్‌ కదిరి అప్పారావు, వైజాగ్‌ జనరల్‌ కార్గో బెర్త్‌ (వీజీసీబీ) సీఈఓ శ్రీ సీ సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వేదాంత యొక్క వీజీసీబీ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా ప్రస్తుత బ్యాచ్‌లోని 500మందికి పైగా బాలికలు ప్రయోజనం పొందనున్నారు. అలాగే ఈ పాఠశాలలో భావి బ్యాచ్‌లు సైతం ప్రయోజనం పొందనున్నాయి. ఈ వినూత్నమైన కార్యక్రమాలను విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు ప్రశంసించారు.

వేదాంత – ఐరన్‌ అండ్‌ స్టీల్‌ సెక్టార్‌ సీఈఓ సౌవిక్‌ మజుందార్‌ మాట్లాడుతూ ‘‘వేదాంత వద్ద మేము ఎప్పుడూ కూడా మా నిర్మాణాత్మక సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని ప్రయత్నిస్తుంటాము. కమ్యూనిటీల అభివృద్ధి తో పాటుగా నిలకడగా వృద్ధి సాధించేందుకు దృష్టి సారించాల్సిన అత్యంత కీలకమైన విభాగం విద్య అని మేము నమ్ముతుంటాము. ఈ వినూత్నమైన సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల పట్ల వీజీసీబీ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా పాఠశాల మౌలిక వసతులను వారు మెరుగుపరచడంతో పాటుగా అత్యుత్తమ విద్యా సదుపాయాలకు భరోసా కల్పించారు మరియు విద్యార్ధులు మరింత మెరుగైన ప్రతిభను కనబరిచేందుకు అనుకూలమైన వాతావరణం సైతం సృష్టించే దిశగా తోడ్పాటునీ అందిస్తున్నారు’’ అని అన్నారు.

చైతన్య స్రవంతి ఫౌండింగ్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ షిరిన్‌ రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను వీజీసీబీ నిర్వహిస్తోంది. వీరు నెలవారీ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా మురికివాడలలో వీరు వీటిని నిర్వహిస్తున్నారు. వీరు కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌కు హోల్టర్‌మెషీన్‌తో మద్దతునందించడంతో పాటుగా ఈ పాఠశాలకు కంప్యూటర్‌ ల్యాబ్‌, సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌తో మద్దతునందిస్తున్నారు. వీజీసీబీ చేపట్టిన ఆలోచనాత్మక కార్యక్రమాలు ప్రశంసనీయం’’ అని అన్నారు.

వైజాగ్‌ మండల విద్యాశాఖాధికారి కొర్ర సువర్ణ మాట్లాడుతూ ‘‘పాఠశాలకు అవసరమైన కంప్యూటర్‌, ట్రైనర్‌, సొలార్‌ ప్యానెల్స్‌ అందించడం ద్వారా మద్దతునందించిన వీజీసీబీ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదములు. విద్యార్థుల డిజిటల్‌ అభ్యాసానికి ఇది ఎంతగానో తోడ్పడనుంది. గతంలో కూడా వీజీసీబీ పాఠశాలకు మద్దతునందించడంతో పాటుగా మరెన్నో కార్యక్రమాలలోనూ తోడ్పాటునందించింది. ఈ తరహా మరిన్ని కార్యక్రమాల ద్వారా మేనేజ్‌మెంట్‌ తమ మద్దతు కొనసాగించనుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

వేదాంత–వీజీసీబీ సీఈవో సి సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘వీజీసీబీ వద్ద మేము కార్యకలాపాలు నిర్వహిస్తోన్న చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతశ్రేణి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సామాజిక–ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నాము. ఈ వినూత్నమైన సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా క్వీన్‌ మేరీస్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలకు మద్దతునందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మరింతగా కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మా మద్దతును విస్తరించనున్నాము’’ అని అన్నారు.

వేదాంత యొక్క వీజీసీబీ పలు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ద్వారా వైజాగ్‌లో అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇటీవలనే ఈ కంపెనీ కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌లో వైద్య యంత్రసామాగ్రిని ఈ కంపెనీ విరాళంగా అందజేసింది. వీటితో పాటుగా పలు వైద్య ఆరోగ్య శిబిరాలను సైతం నిర్వహించింది. అలాగే సంస్ధ చేపట్టిన నీటి ప్రాజెక్ట్‌లతో 2వేలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి.

Vedanta VGCB Support to School development in Vizag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News