Sunday, January 19, 2025

హైదరాబాద్‌లోకి ప్రవేశించిన వీయం సాఫ్ట్‌వేర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డాటా ప్రొటెక్షన్, రాన్సమ్‌వేర్ రికవరీలో అంతర్జాతీయంగా అగ్రగామి వీయం సాఫ్ట్‌వేర్ హైదరాబాద్‌లో ‘వీయం ఆన్ టూర్ ఇండియా 2023’ని నిర్వహించింది. ఈ కార్యక్రమం డాటా రికవరీ నిపుణుల కోసం కమ్యూనిటీ ఈవెంట్‌ను రూపొందించడం లక్ష్యంగా చేసుకుంది. బ్యాకప్, రికవరీ నిపుణుల కోసం రూపొందించిన వీయం ఆన్ టూర్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్‌లో ‘బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ, రాన్సమ్‌వేర్’ అనే అంశంపై చర్చ జరిగింది.

ఈ ప్యానెల్‌కు వీయం సిస్టమ్స్ ఇంజినీరింగ్ హెడ్ (ఇండియా అండ్ సార్క్,) అమోల్ దివాన్జీ నాయకత్వం వహించారు. వీయం సాఫ్ట్‌వేర్ ఫర్ ఇండియా అండ్ సార్క్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భంబురే మాట్లాడుతూ, హైదరాబాద్‌లో వీయం ఆన్ టూర్‌ని నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నామని అన్నారు. తరచుగా పెరుగుతున్న సైబర్ దాడుల దృష్ట్యా, సంస్థలు చురుకైన విధానాలను అనుసరించటం, డాటా రక్షణ, పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News