Thursday, December 19, 2024

హైదరాబాద్‌లో వీయం ఆన్ టూర్ ఇండియా 2023

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డాటా ప్రొటెక్షన్, రాన్సమ్‌వేర్ రికవరీలో అంతర్జాతీయంగా అగ్రగామి వీయం(Veeam®) సాఫ్ట్‌వేర్, హైదరాబాద్‌లో వీయం ఆన్ టూర్ ఇండియా 2023ని నిర్వహించింది. వీయం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమం డాటా రికవరీ నిపుణుల కోసం కమ్యూనిటీ ఈవెంట్‌ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది డాటా భద్రత, రాన్సమ్ వేర్ రికవరీ పట్ల కంపెనీ యొక్క స్థిరమైన అంకితభావాన్ని ప్రతిబింభించింది.

బ్యాకప్, రికవరీ నిపుణుల కోసం రూపొందించబడిన, వీయం ఆన్ టూర్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్‌లో ‘బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ, రాన్సమ్‌వేర్’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ ప్యానెల్‌కు వీయం సిస్టమ్స్ ఇంజినీరింగ్ హెడ్ (ఇండియా & సార్క్,) అమోల్ దివాన్జీ నాయకత్వం వహించారు. ప్యానలిస్టులలో వంశీ కృష్ణ GV, VP-IT, Quislex, CK ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రైల్వే మంత్రిత్వ శాఖ M. ప్రభాకర్ రావు, అసోసియేట్ VP IT & IS, నాట్కో ఫార్మా లిమిటెడ్ వున్నారు. ప్యానెలిస్ట్‌లు వినూత్న డాటా రక్షణ వ్యూహాలను గురించి చర్చించటంతో పాటుగా ర్యాన్సమ్ వేర్ రికవరీ కోసం ఉత్తమ పద్ధతులను సైతం సిఫార్సు చేశారు.

ఈ కార్యక్రమం వీయం డాటా ప్లాట్‌ఫారమ్ చుట్టూ ఆవిష్కరణలు, C-Suite సభ్యుల నుంచి తెలుసుకున్న జ్ఞానంతో ఆధునిక, తెలివైన డాటా రక్షణ, క్లౌడ్ డాటా మేనేజ్‌మెంట్‌లో ESG, DEI కథనాలను అభివృద్ధి చేయడం, మరిన్నింటిని ప్రదర్శించడం ద్వారా డాటా రక్షణ యొక్క భవిష్యత్తు గురించి సమగ్ర అవగాహనా కల్పించింది. క్లౌడ్, భద్రతా సామర్థ్యాలలో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి పరిశ్రమ నిపుణులను శక్తివంతం చేస్తూ, పరిష్కార-ఆధారిత సెషన్‌ల యొక్క లోతైన అన్వేషణను సులభతరం చేయడానికి ఈ ఈవెంట్ వ్యూహాత్మకంగా రూపొందించబడింది. పరిశ్రమలలో సైబర్‌ దాడులు పెరుగుతున్న కాలంలో ముఖ్యమైన సంస్థాగత డాటాను భద్రపరచడం చాలా ముఖ్యమైనది. ఈ కార్యక్రమ సమయంలో, వీయం సాఫ్ట్‌వేర్ దాని తాజా Veeam® 2023 Ransomware ట్రెండ్‌ల నివేదిక నుండి తెలుసుకున్న అంశాలను కూడా పంచుకుంది, ఇది ప్రతి ఏడు సంస్థల్లో ఒకటి దాదాపు డాటా మొత్తం (>80%) ర్యాన్సమ్ వేర్ దాడి ఫలితంగా ప్రభావితమైనదని సూచిస్తుంది.

వీయం సాఫ్ట్‌వేర్ ఫర్ ఇండియా & సార్క్ వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భంబురే మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో వీయం ఆన్ టూర్‌ని నిర్వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. తరచుగా పెరుగుతున్న సైబర్‌ దాడుల దృష్ట్యా, సంస్థలు చురుకైన విధానాలను అనుసరించటం, డాటా రక్షణ, పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం చేయాల్సి వుంది. భారతదేశం ఒక కీలకమైన టెక్నాలజీ హబ్‌గా ఎదిగింది. వీయం ఆన్ టూర్‌ ఇండియా నేటి శక్తివంతమైన ముప్పు వాతావరణంలో డాటా రికవరీ యొక్క కీలక పాత్రను ప్రధానంగా వెల్లడి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. నిపుణుల నేతృత్వంలోని చర్చలు, వినూత్న సెషన్‌లు, సైబర్ థ్రెట్ మేనేజ్‌మెంట్ లో ప్రదర్శనల ద్వారా, క్లౌడ్-ఆధారిత డాటా రక్షణ తో భవిష్యత్తు కోసం డాటాను సంరక్షించడం, మన కమ్యూనిటీకి భద్రతాపరమైన బెదిరింపుల యొక్క అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడం వంటి వాటి పట్ల మేము మా లక్ష్యం ను ఆసక్తిగా ప్రదర్శిస్తున్నాము” అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో, ఫార్మాస్యూటికల్, మ్యానుఫ్యాక్చరింగ్ వర్టికల్స్‌లో మార్కెట్ విస్తరణకు, గ్రాన్యూల్స్ ఇండియా వంటి కస్టమర్‌లతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము భారీ అవకాశాన్ని చూస్తున్నాము. వ్యాపారాలకు వారి డాటా రక్షణ, పునరుద్ధరణ వ్యూహంతో సహాయం చేయడానికి, సైబర్ స్థిరత్వపు ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి ఈ కీలక వెర్టికల్స్ లో మా ప్రయత్నాలను రెట్టింపు చేయడం మా ప్రాధాన్యతగా వుంది” అని అన్నారు.

డాటా రక్షణ, ర్యాన్సమ్ వేర్ రికవరీ సొల్యూషన్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌పై అవగాహన కల్పించడానికి, సంస్థలు డాటాను ఎలా స్వంతం చేసుకోవచ్చు, బ్యాకప్ చేయగలవు, తిరిగి పొందగలవని చూపించడానికి వీయం ఆన్ టూర్ ఇండియా మిగిలిన నెలలో దేశవ్యాప్తంగా రెండు ప్రదేశాలలో చేయటానికి షెడ్యూల్ చేయబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News