Monday, December 23, 2024

ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ, వాణి

- Advertisement -
- Advertisement -

Veena and Vani are twins who achieved first class in Inter

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ, వాణిలు సత్తా చాటారు. ఇంటర్మీడియట్లో వారిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. ఇంటర్‌లో సిఇసి కోర్సును అభ్యసించిన వీణ 712 మార్కులు, వాణి 707 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీణ, వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వారి ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీణ, వాణిలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. వీణ – వాణిల చదువుకు సహకరించిన అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు. అయితే వీరిద్దరూ ఇంటర్ పరీక్షలు స్వయంగా రాశారు. పదో తరగతిలోనూ వీణ, వాణి ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News