Tuesday, November 26, 2024

ఆస్ట్రేలియాలో భారత సంతతి మహిళా శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం!

- Advertisement -
- Advertisement -

Veena Sahajwalla
మెల్‌బోర్న్: భారత సంతతికి చెందిన చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వీణా సహజ్‌వాలాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం ఆమెను ఎన్‌ఎస్‌డబ్లు ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుతో సన్మానించింది. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం ప్రీమిర్ డామినిక్ పెర్రోటేట్ ఆమెకు మంగళవారం ఆ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ మార్గరేట్ బీజ్లీ హాజరయ్యారు. వీణ ప్రస్తుతం సౌత్‌వేల్స్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆస్ట్రేలియన్ రీసెర్స్ కౌన్సిల్ లారియేట్ కూడా. ఆమె పదార్థ శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేసి ఖ్యాతి గడించారు. ఆమె నేతృత్వంలోనే న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీలో ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. అవార్డు పొందినందుకు వీణా సహజ్‌వాల్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. అవార్డుకు తన పేరును ప్రతిపాదిస్తారని కూడా తాననుకోలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News