- Advertisement -
తమిళ హీరో చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దుషార విజయన్ హీరోయిన్‌గా నటించింది. విజయ్ సేతుపతి, ఎస్ జే సూర్య, సూరజ్ వెంజర కీలక పాత్రలో నటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకముందే ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 25 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
- Advertisement -