Thursday, December 19, 2024

వీరశైవులు లింగాయత్‌లది ఒకటే ధర్మం

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: వీరశైవులు, లింగాయత్‌లు అంతా ఒక్కటే ధర్మం అని, బసవేశ్వరుని ఆచరణలను పాటిస్తూ ముందుకు సాగాలని శ్రీశైలం సూర్య సింహానాధీశ్వర శ్రీశ్రీశ్రీ జగద్గురు అన్నారు. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ శివారులోని గోకుల్ కన్వెన్షన్ సెంటర్‌లో శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచాచార్య యుగమానోత్సవ శ్రీ మహాత్మ బసవేశ్వర జంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఇళ్ల నిర్మాణాలపై ముస్లింల వాహనాలపై ప్రత్యేకంగా రాసుకునే 786 నెంబర్‌లాగా వీరశైవులకు ఒక కోడ్ ఉందన్నారు.

ప్రతి వీరశైవుడు నిర్మించుకునే ఇళ్లపై, వాహనాలపై 156 రాసుకోవాలని, ఆ నెంబర్ ఉంటే వీరశైవులనే గుర్తింపు ఉంటుందన్నారు. బసవేశ్వరుడు దేశాన్నీ ధర్మాన్ని ప్రజల్ని రక్షించాల్సిన బాటను చూపిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అన్నారు. వివిధ పీఠాధిపతులు, స్వామిజీలను పలువురు పాదా పూజ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన చన్న సిద్దరామ పండితారాధ్య, శిశచార్యా మహాస్వామిలను తెలంగాణ చేనేత కార్పోరేషన్ చైర్మెన్ చింత ప్రభాకర్ స్వామిజీలను సన్మానించారు.

అదే వి ధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూర్పు నిర్మళజగ్గారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, బిజెపి అసెంబ్లీ ఇంఛార్జీ రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, బిజెపి నాయకుడు శివరాజ్ పాటిల్ ,అదికే జగదీశ్వర్, బిఆర్‌ఎస్ నాయకురాలు మందుల వరలక్ష్మిలు హాజరై స్వామీజీలను దర్శించుకొని వారికి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వీర శైవ జిల్లా సమాం మహిళ విభాగం నాయకులు గౌరవ అధ్యక్షుడు శివ చంద్ర పాటిల్, అధ్యక్షుడు ప్రసాది మధు శేఖర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇప్పెపల్లి నర్సింలు, నాయకులు జయప్రకాష్, మంజుల, ముద్ద శశికళ, శారద, మళ్లిఖాఉ్జన్,రవికుమార్, నవీన్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News