Saturday, January 18, 2025

వేటాడే సింహంలా ’వీరసింహారెడ్డి’

- Advertisement -
- Advertisement -

Veera Simha Reddy Movie Title Motion Poster

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఎన్‌బికె 107’కి పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ’వీరసింహారెడ్డి’ టైటిల్ ని ఖరారు చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై 3డి టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. టైటిల్ పోస్టర్‌లో బాలకృష్ణ వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు నిర్మాతలు. టైటిల్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ “బాలకృష్ణ అభిమానిగా, ఆయన సమర సింహారెడ్డి చూసిన అభిమానిగా తీసిన సినిమా వీరసింహారెడ్డి. సినిమా షూటింగ్ ఇంకా ఇరవై రోజులు వుంది. సాయి మాధవ్ బుర్రా డైలాగుల్లో వీరసింహారెడ్డి విశ్వరూపం చూస్తారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వై రవిశంకర్, సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు.

Veera Simha Reddy Movie Title Motion Poster

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News