Monday, December 23, 2024

బాలయ్య ఐకానిక్ స్టిల్ తో రెడీ అయిన వీరసింహారెడ్డి థియేటర్ స్టాండీస్

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ను మునుపెన్నడూ చూడని మాస్ మరియు యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వీర సింహారెడ్డి. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ గ్రాండ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను భారీ కాన్వాస్పై మౌంట్ చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

టాప్ ఫామ్లో ఉన్న ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు ,ఇప్పటివరకు విడుదలైన జై బాలయ్య మరియు సుగుణ సుందరి అనే రెండు సింగిల్స్ స్మాషింగ్ హిట్ గా నిలిచి ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
ఈ క్రమం లో చిత్ర బృందం అవుట్ డోర్ ప్రమోషన్ లను ప్రారంభించింది. థియేటర్ స్టాండీలు సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని థియేటర్లకు పంపుతున్నారు.

బ్లాక్ షర్ట్ మరియు లేత గోధుమరంగు రంగు లుంగీతో గంభీరంగా కారు పక్కన నడుస్తున్న బాలకృష్ణ స్టిల్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఐకానిక్ స్టిల్ ఇప్పటికే మాస్ లో బాగా ప్రాచుర్యం పొందింది మరియు థియేటర్ స్టాండీల పై ఇంకా గొప్పగా కనిపిస్తుంది. వీరసింహారెడ్డి చిత్రం చివరి పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుక గా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News