Monday, December 23, 2024

‘వీరసింహారెడ్డి’ ‘సెకండ్ సింగిల్’ ట్రెండింగ్

- Advertisement -
- Advertisement -

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ చూడని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య స్మాషింగ్ హిట్‌ గా నిలిచింది. ఈ రోజు సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియోను విడుదల చేశారు.

Veera Simha Reddy Second Single Lyrical Videoథమన్ ట్యూన్ లవ్లీగా కన్సిస్టెంట్ పేస్ తో ఆకట్టుకుంది. రామ్ మిరియాల, స్నిగ్ధ హై-పిచ్ వోకల్స్ తో ఈ పెప్పీ నెంబర్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మాస్‌ ని మెస్మరైజ్ చేయగా కొన్ని లైన్లు మరింత కిక్ ఇచ్చేలా వున్నాయి. బాలకృష్ణ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క్లాస్‌ గా కనిపించినప్పటికీ, డ్యాన్స్‌లు మాస్‌ ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు శృతి హాసన్ తన ఎలిగెన్స్ తో కట్టిపడేసింది. డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల విందుగా వున్నాయి. ఈ పాటలో బాలకృష్ణ, శృతి హాసన్ కెమిస్ట్రీ రాకింగ్ గా వుంది. రిషి పంజాబీ తీసిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇస్తాంబుల్‌ లోని అందమైన ప్రదేశాలు ఆహ్లాదకరంగా చూపించారు. మొదటి పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మేకర్స్ రెండో పాటతో అంచనాలను మరింతగా పెంచారు. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

Veera Simha Reddy Second Single Lyrical Videoఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News