Monday, December 23, 2024

వీర మాస్ బ్లాక్ బస్టర్

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ’వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

‘అఖండ’ తర్వాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు. దానికి ధీటుగానే వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా వీరసింహా రెడ్డి. తమన్ అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం అందించారు. రామ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు అద్భుతంగా చేయడం జరిగింది”అని తెలియజేశారు.

దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ “మొత్తం నైజాంలో 54 థియేటర్స్‌లో నాలుగు గంటలకు షో పడటం ఒక రికార్డ్.. రాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తే అరగంటలో టికెట్స్ అన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు హుషారుగా వచ్చి సినిమా చూశారు. ఇది మామూలు విషయం కాదు. నందమూరి బాలకృష్ణ నాకు ఇచ్చిన అవకాశాన్ని వందశాతం ఫుల్ ఫిల్ చేసుకున్నానని బలంగా నమ్ముతున్నాను. శ్రుతి హాసన్, వరలక్ష్మీ అద్భుతంగా నటించారు”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో నవీన్ యెర్నేని,వై రవిశంకర్, తమన్, వరలక్ష్మీ శరత్ కుమార్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News