Monday, December 23, 2024

‘వీరసింహారెడ్డి’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ’వీరసింహారెడ్డి’. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌లో కనిపిస్తున్న ఈ చిత్రం మాసస్‌లో భారీ అంచనాలని సృష్టించింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ జై బాలయ్య యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలకృష్ణ సీరియస్ లుక్ లో కనిపించారు. తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించిన బాలకృష్ణ లుక్ టెర్రిఫిక్ గా వుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

Veera Simha Reddy to release on Jan 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News