Wednesday, January 22, 2025

’వీరసింహారెడ్డి’ నుంచి ‘మాస్ మొగుడు…’ లిరికల్ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ ‘మాస్ మొగుడు’ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై తమన్ మాసీవ్, ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య బెహరా సూపర్ ఎనర్జిటిక్‌గా పాడారు.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాలకృష్ణ పాత్ర గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ “వీరసింహారెడ్డి… ష్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ మూవీ. రాసిపెట్టుకోండి. తమన్ ఎక్స్ ట్రార్డినరీ సాంగ్ ఇచ్చారు. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి రాశారు. మాస్ మొగుడు… చివరలో తీసిన పాట. మా కెమరామెన్ రిషి పంజాబీ చాలా కలర్‌ఫుల్‌గా బాలయ్య బాబుని చూపించాడు”అని అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ “ఇప్పటి వరకు వచ్చిన నాలుగు పాటలే కాదు సినిమాలో వచ్చే మరో రెండు పాటలు కూడా అద్భుతంగా వుండబోతున్నాయి. వీరసింహారెడ్డి మూవీ అద్భుతంగా ఉంటుంది” అని చెప్పారు. ఈ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News