Monday, January 20, 2025

‘వీరసింహా రెడ్డి’ గా బాలయ్య

- Advertisement -
- Advertisement -

Veera simhareddy will release on Sankranthi 2023

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ  #ఎన్ బికె107 కి పవర్ ఫుల్ టైటిల్ ఖరారైయింది. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్‌ను వేలాది మంది అభిమానుల సమక్షంలో భారీగా లాంచ్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై 3డి టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ యాప్ట్ టైటిల్. ‘సింహా’పేరుతొ  బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు భారీ బ్లాక్‌ బస్టర్‌ లుగా నిలిచాయి. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది.  టైటిల్ పోస్టర్ లో బాలకృష్ణ ఫెరోషియస్ గా కనిపించారు. పోస్టర్ పై  గర్జించే సింహం బాలకృష్ణ క్యారెక్టర్ ని  ప్రతిబింబిస్తుంది. టైటిల్ పోస్టర్ లో బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో వేటకు సిద్ధమైన సింహం లా కనిపిస్తున్నారు. పులిచెర్ల 4 కిలోమీటర్ల మైల్ స్టోన్ కనిపిస్తోంది.  టైటిల్ పోస్టర్  సినిమా పై  భారీ బజ్ పెంచింది,  ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్‌ హంట్‌ కి  భారీ స్పందన  వచ్చింది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు నిర్మాతలు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఎన్ బికె107కి  సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News