Sunday, December 22, 2024

వీరభద్రీయులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

- Advertisement -
- Advertisement -

బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్

మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజంలో సంచార జాతులుగా ఉన్న వీరభద్రీయులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, వాటా కోసం అవసరమైతే ఉద్యమం నిర్మిద్దామని తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. 50 సంవత్సరాల తరువాత ఇప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగా వారి కోరికను నెరవేర్చేలా రాజకీయ అవకాశాలను కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణా వీర భద్రీయ (వీర ముష్టి) సంఘం కేంద్ర కమిటీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో వీరభద్రీయులకు చైర్మన్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ స్వర్ణోత్సవాల్లో జాతీయ వీర భద్రీయ (వీర ముష్టి) సంఘం అధ్యక్షులు కోటపల్లి రాజేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మండలాలు, జిల్లాలో సంఘం భావనాల కోసం 10 గుంతల స్థలం కేటాయించి నిర్మించాలన్నారు. అన్ని మండలాల్లో వీర భద్రీయ పేరుతో ధృవీకరణ పత్రాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాంస్కృతిక కళాకారులకు ప్రత్యేక సంగీత అకాడమీ ఏర్పాటు చేయాలని, కళాకారుల కోసం పింఛన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కోయినా పల్లి గ్రామా సర్పంచ్ మిట్టపల్లి వసంత ఋషి , ఉప సర్పంచ్ ఎం. ఎల్లేష్, తెలంగాణా వీర భద్రీయ (వీర ముష్టి) సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు కోటపల్లి వీరా స్వామి, ప్రధాన కార్యదర్శి చెవ్వ కొండయ్య, కేంద్ర కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు మిట్టపల్లి పోచయ్య, కోశాధికారి కాటపల్లి రవికుమార్, కేంద్ర కమిటీ కార్యదర్శి కడెం జంగయ్య, జాతీయ కమిటీ కార్యదర్శి పొన్నాల శివరాజ్, జాతీయ కమిటీ కోశాధికారి కాటపల్లి గండి స్వామి, వీర భద్రీయ (వీర ముష్టి) చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ చెవ్వ విజయచందర్, ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్, కార్యదర్శి కాటపల్లి ఎల్లేష్, కోశాధికారి కాటపల్లి శ్రీశైలం, విద్యా కమిటీ చైర్మన్ కాటపల్లి విఠల్, జిల్లా అధ్యక్షులు కడెం కోటయ్య (మహబూబ్ నగర్), మిట్టపల్లి జనార్దన్ (కామారెడ్డి), అగుళ్ల శంకర్ (సిద్ధిపేట), నారాయణపేట (సారంగి భీమేష్) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News