Sunday, January 5, 2025

దాచారం గ్రామవాసికి డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బీమనబోయిన వీరమల్లు యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ అంజయ్య పర్యవేక్షణలో వీరమల్లు నిజాం రాజ్యంలో కరువు, పర్యావరణ పరిస్థితులు అన్న అంశంపై పరిశోధన చేసి వివిధ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన చేసిన పరిశోధనకు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఆయన చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టరేట్ అందుకున్న వీరమల్లు యాదవ్ ను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, దాచారం గ్రామస్థులు అభినందించారు.

Also Read: కాంగ్రెస్ గొడ్డలికి బలవుతారా?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News