Monday, December 23, 2024

నాలుగు కాలాల పాటు గుర్తుండే సినిమా వీరాంజనేయులు విహారయాత్ర

- Advertisement -
- Advertisement -

డా.నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. నటి పవిత్ర లోకేష్ టీజర్‌ని లాంచ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్‌లో డా. నరేష్ వికె మాట్లాడుతూ “శతమానం భవతి సినిమా ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా అలానే అలరిస్తుంది. చాలా అద్భుతమైన ఎమోషన్ వున్న కథ ఇది”అని అన్నారు. నటి పవిత్ర లొకేషన్ మాట్లాడుతూ “నరేష్ గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది”అని తెలియజేశారు. దర్శకుడు అనురాగ్ పాలుట్ల మాట్లాడుతూ “వీరాంజనేయులు విహారయాత్ర’ నాలుగు కాలాలు పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో కాదు ప్రేమతో చెబుతున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈటివి విన్ – కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News