Sunday, January 5, 2025

లోక్ సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె!

- Advertisement -
- Advertisement -

పేరుమోసిన ఒకప్పటి స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె ఎన్నికల బరిలోకి దిగారు. వీరప్పన్ కుమార్తె పేరు విద్యారాణి. ఆమె వృత్తిరీత్యా లాయర్. తమిళనాడులోని కృష్ణగిరి పార్లమెంటు స్థానంనుంచి తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి పార్టీ టికెట్ పై ఆమె పోటీ చేస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం బిజేపీలో చేరిన విద్యారాణి, ఇటీవలే నామ్ తమిజర్ కచ్చి పార్టీలో చేరారు. వీరప్పన్, ముత్తులక్ష్మి దంపతులకు పుట్టిన బిడ్డే విద్యారాణి. వీరప్పన్ జీవితమంతా అడవుల్లోనే గడవడంతో తండ్రితో ఆమెకు పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. తను ఒకే ఒక్కసారి 2002లో తన తండ్రిని చూశానని గతంలో విద్యారాణి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News