Thursday, January 23, 2025

సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు: సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజ్ పంక్షన్ హాల్లో సమాజం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాం డూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రాష్ట్ర బిసికమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తాండూరులో వీరశైవ సమాజం పెద్దదని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సమాజ అభివృద్దికి ఎన్నో నిధులు అందజేయడం జరిగిందన్నారు. ఇక ముందు కూడా సమాజ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరులో వీరశైవ సమాజం సభ్యులు ఐక్యమత్యంతో అభివృద్ది చెందుతున్నారని అన్నారు.

సమాజంకు సంబంధించిన రుద్రభూమిలో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ది చేయించడం జరిగిందన్నారు. చిం చోలి ప్రధాన రోడ్డు మార్గం నుంచి పంక్షన్ హాల్ వరకు రోడ్డు వేయించాలని సమాజం సభ్యుల కోరిక మేరకు ఇపుడే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధం గా తాండూరు రూపురేఖలు మారుస్తానని అన్నారు. గతం లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి అస్తవ్యస్థంగా ఉండేదని నేడు రాష్ట్రంలోనే నెంబరు వన్ ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చడం జరిగిందన్నారు. వీర శైవ సమాజం సభ్యులు అంతా ఏకమై సమాజ అభివృద్దికి కృషి చేయాలని సూచించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన స మాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్, కార్యదర్శి రవికుమార్, కార్యవర్గం సభ్యులను ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్; జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమల్, వైస్ చైర్‌పర్సన్ దీపానర్సింలు, పటేల్ శ్రీశైలం, నేత మహేష్, భద్రేశ్వర దేవాలయ ఛైర్మన్ సుధాకర్, కౌన్సిలర్ లావణ్య, సమాజం ఎన్నికల అధికారి నారాయణ, జొన్నల బస్వరాజ్, కార్యవర్గ సభ్యులు, గాజుల శంకర్, చంద్రశేఖర్, పరమేశ్వర్, ప్రవీన్‌పటేల్, తంబాకు చంద్రశేఖర్, శ్రావణ్‌కుమార్, గౌరీశంకర్, ప్రకాష్, బాలిశివకుమార్, రవిగౌడ్, సునితాసంపత్‌కుమార్, శ్యాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News