Monday, December 23, 2024

‘వీరసింహా రెడ్డి’… గ్రేట్ ఎమోషనల్ జర్నీ

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఈ నేపధ్యంలో ’వీరసింహారెడ్డి’ లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దర్శకుడు గోపీచంద్ సినిమాలో నా పాత్ర గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ’వీరసింహారెడ్డి’ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇందులో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. ఈ సినిమాలో ఫైట్స్ చాలా పవర్‌ఫుల్‌గా వుంటాయి. ఇందులో బాలకృష్ణతో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎనర్జీ, పని పట్ల అంకితభావం గొప్పగా వుంటుంది. ‘వీరసింహా రెడ్డి’ సినిమా అభిమానులు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News