అమరావతి: సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కందుకూరి విరేశలింగం పంతులు జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని ఆనాడే ఎత్తి చూపామని, మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో టిడిపికి ఆయనే స్ఫూర్తి అని కొనియాడారు. గతంలో విద్యుత్ బిల్లులు రెండు వందల రూపాయలు వచ్చేందని, ఇప్పుడు రూ. 600 నుంచి రూ.1000 వస్తుందని బాబు మండిపడ్డారు. సరాసరి రూ.500 కరెంట్ బిల్లు అనుకుంటే జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.70 ఉండేవని, ఇప్పుడు రూ.110 చేరుకుందని, జగన్ ప్రభుత్వం 1.3 లక్షల కోట్లు దోచుకుందని దుయ్యబట్టారు. నిత్యావసర, కూరగాయాలు, సిమెంట్, స్టీలు ధరలు విపరీతంగా పెరిగాయన్నారు.
వీరేశలింగం పోరాటం చిరస్మరణీయం: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -