Saturday, November 2, 2024

ప్రకృతి ప్రేమికుల కోసం వీరుస్త గ్రీన్ విండ్స్ ప్రాజెక్ట్

- Advertisement -
- Advertisement -

వీరుస్త లైఫ్ స్పేసేస్ సిఈఓ వైగండ్ల వెంకటేశ్వర్లు

మనతెలంగాణ/హైదరాబాద్:  అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికుల డ్రీమ్ హోమ్ కోసమే వీర్తుస గ్రీన్ విండ్స్ ప్రాజెక్ట్ ను చేపట్టామని వీర్తుస లైఫ్ స్పేసేస్ సిఈఓ వైగండ్ల వెంకటేశ్వర్లు వెల్లడించారు. కాలుష్య రహిత జీవనం, నగర శివార్లలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని చాలామంది నివాసితులు మకాం మార్చడానికి ఇష్టపడుతూన్నారని, వారి కోసం సహజ సౌందర్యం, పట్టణ పెరుగుదల కలిసి ఉన్న రంగారెడ్డి జిల్లా 100 ఫీట్ కడ్తాల్ – తలకొండపల్లి రోడ్డులో వీర్తుస గ్రీన్‌విండ్స్ వెంచర్‌ను ఏర్పాటు చేశామని అయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా 100 ఫీట్ కడ్తాల్ – తలకొండపల్లి రోడ్ లో వీర్తుస గ్రీన్ విండ్స్ వెంచర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ నటులు అనసూయ భరద్వాజ్, ఈషా రెబ్బ, సినీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్రలతో కలిసి వైగండ్ల వెంకటేశ్వర్లు ‘వీర్తుస గ్రీన్ విండ్స్’ నూతన వెంచర్ ను ప్రారంభించి, బ్రోచర్‌లను ఆవిష్కరించారు.

26.15 ఎకరాలు… 150 నుంచి 600 చదరపు అడుగులు

ఈ సందర్భంగా వైగండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిటిసిపి ఆమోదించిన ‘వీర్తుస గ్రీన్ విండ్స్’ ప్రాజెక్ట్‌లో 26.15 ఎకరాల్లో వంద శాతం వాస్తుతో 150 నుంచి 600 చదరపు గజాల ప్లాట్స్ చేపట్టామన్నారు. దీంతోపాటు అందమైన ఆర్చ్, ప్రాజెక్ట్ చుట్టూ ప్రహరీ గోడలతో భద్రత, 24 గంటలు పనిచేసే సిసి కెమెరాలు, 33 నుంచి 40 ఫీట్ల సిసి రోడ్లు, భూగర్భ విద్యుత్, ఎల్‌ఈడి స్ట్రీట్ లైట్స్, ల్యాండ్ స్కేప్ పార్క్, ప్రత్యేకంగా చిన్న పిల్లలు ఆదుకునేందుకు స్థలం, టైల్ ఫుత్‌పాత్‌లు, మంచినీళ్ల ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కు త్రాగునీరు కనెక్షన్, భూగర్భ డ్రైనేజీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, బాడ్మింటన్ బాల్ కోర్టులతో పాటు ఇంకుడు గుంతలను కూడా ఏర్పాటు చేశామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, టిసిఎస్, అమెజాన్ డేటా సెంటర్ లాంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, హార్డ్‌వేర్ పార్క్, ఈ-సిటీ, ఫార్మా సిటీలతో పాటు అద్భుతమైన కనెక్టివిటీ, మంచి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యం, ప్రముఖ విద్యా, వినోద సంస్థలు వీర్తుస గ్రీన్ విండ్స్‌కు చేరువలో ఉన్నాయన్నారు. వీర్తుస లైఫ్ స్పేసేస్ కు స్థిరమైన రెసిడెన్షియల్ ప్రాజెక్టు వినియోగదారులకు సురక్షితమైన ప్రాంతమని ఆయన తెలిపారు. స్పష్టమైన టైటిల్, సరసమైన ధరలు, కొనుగోలు దారుల అంచనాలను మించిన సౌకర్యవంతమైన ప్లాట్‌లుగా విభజించమని, ఈ ప్లాట్‌లను కొనుగోలు చేసి మీరు ఊహించిన విధంగా మీ కలల గృహాలను, విల్లాలను నిర్మించుకోవచ్చునని ఆయన తెలిపారు. వినియోగదారుల జీవితమంతా శ్రేయస్సుతో గడుపుకోవచ్చునని వైగండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అభివృద్ధిలో శ్రీశైలం రహదారి ముందంజ

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటి శ్రీశైలం హైవే రహదారి అని, వీర్తుస గ్రీన్ విండ్స్ అద్భుతమైన స్థలమని, ఇందులో ప్లాట్‌లు కొనుగోలు చేయవచ్చునన్నారు. ఈషా రెబ్బ మాట్లాడుతూ నగర కాలుష్యానికి దూరంగా, నిర్మలమైన వాతావరణంలో ఉన్న సురక్షితమైన హౌసింగ్ ప్రాజెక్ట్ ‘వీర్తుస గ్రీన్ విండ్స్’ అని ఆయన తెలిపారు. చమ్మక్‌చంద్ర మాట్లాడుతూ వీర్తుస గ్రీన్‌విండ్స్ ప్రాజెక్ట్ మొత్తం అభివృద్ధి, విశాలమైన రోడ్లు, బాగా నిర్వహించబడుతున్న పార్కులు, ఇతర సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News