కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘వేగం…’ శుక్రవారం విడుదల కానుంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్. భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా పాడిన ఈ పాటకు కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు. సాంగ్ రిలీజ్ పోస్టర్‌లో నాగార్జున, సోనాల్ చౌహాన్ క్రూయిజ్‌లో రొమాన్స్ చేస్తూ కనిపించారు. సోనాల్ గ్లామరస్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
Vegam First Single from Ghost to release on Sep 16