Monday, January 20, 2025

10లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు

- Advertisement -
- Advertisement -
Vegetable cultivation in 10 lakh acres in telangana
 ఏటా 36లక్షల టన్నుల ఉత్పత్తే టార్గెట్
 తీగజాతి పంటల సాగుకు భారీగా ప్రోత్సాహకాలు
 చిన్న, సన్న కారు రైతులకు డ్రిప్‌లో రాయితీలు

హైదరాబాద్ : రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. ఈ యాసంగి నుంచే వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలతోపాటు కూరగాయలు, ఆకు కూర పంటల సాగునుకూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర జనాభా నాలుగు కొట్లకు పైగానే ఉంది. ప్రజల ఆహార అవసరాలకు ఏటా 36లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు వినిగిస్తున్నారు. అయితే రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి జరగటం లేదు. 16లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు మాత్రమే రాష్ట్ర పరిధిలో ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన కూరగాలయను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతు చేసుకుంటున్నారు. వరి సాగువల్ల పెద్దగా మిగలకపోగా , మార్కెట్‌లో ధాన్యం విక్రయాల సమస్యలు తలెత్తుతుండటంతో ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగును కూడా ప్రోత్సహిస్తోంది.

రాష్ట్రంలో 10లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు , ఆకు కూర పంటల సాగుకు ప్రణాళిక రూపొందించింది. ఏడాది పొడవునా కూరగాయల ఉత్పత్తికి అవకాశాలు ఉండటంలో రైతులకు ఈ పంటల సాగు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లలో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. పచ్చిమిరప, బెండ కాయ, గోకరకాయ , కాకరకాయ తదితర రకాల కూరగాయల ధరలు గత ఆరునెలలుగా కొండెక్కి కూర్చుకున్నాయి. రాష్ట్రంలో కూరగాలయ సాగు గతంలో మూడున్నర నుంచి నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో జరిగేది .అయితే వివిధ కారణాల రిత్యా ఈ పంటల సాగు విస్తీర్ణం గత ఏడాది 1.5లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ విస్తీర్ణం మరింతగా తగ్గి 63వేల ఎకరాలకు పడిపోయింది. దీంతో రాష్ట్ర అవసరాలకు సరిపడినంత కూరగాయలు, ఆకు కూరల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధార పడక తప్పటం లేదు. మహారాష్ట్ర , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నిత్యం కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ పండించిన కూరగాయలు రాష్ట్రానికి చేరుకునే సరికి రవాణ ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. డీజిల్ ధరలు పెరిగిపోవటంతో సరుకు రవాణకు లారీ బాడుగలు రెట్టింపు పెంచివేశారు.

అంతిమంగా అ భారమంతా కూరగాయల వినియోగదారుల పైనే పడుతోంది. పోరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో టమాటా ధరలు తగ్గిపోయాయి. కిలో టమాటా అక్కడ రూ.5లోపే దొరుకుతుండగా ,అదే సరుకు పత్తికొండ మార్కెట్ నుంచి హైదరాబాద్ చేరుకునే సరకికి కిలో టమా టా ధర రెండింతలు పెరిగిపోతోంది. అదే విధంగా ఇతర కూరగాయల ధరలు కూడా రవణా ఖర్చు లు జతకలిసి మరింతగా పెరిగిపోతున్నాయి. రాష్ట్ర పరిధిలోనే కూరగాయ పంటలను ఉత్ప త్తి చేయడం ద్వారా సరుకు రవాణ ఖర్చులు తగ్గిపోనున్నాయి. అదే విధంగా వం దల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలనుంచి కూరగాయ లు , అకు కూరల రవాణాకు అధిక సమయం పడుతోంది. దీంతో గంటల తరబడి సరకు లారీల్లో ఉండిపోతుండటంతో సరుకు తాజదనం కోల్పోయి నాణ్యత కూడా దెబ్బతింటోందని అధికారులు చెబుతున్నారు. పొలాల్లో పంట కోత అ నంతరం 24గంటల్లోపే వినియోగదారులకు కూరగాయలు చేరవేయగలిగితే తద్వారా పోషక విలువలను కూడా కాపాడుకున్నట్టువుంతుందని వివరిస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించాలంటే రాష్ట్ర పరిధిలోనే జోన్ల వారిగా కూ రగాయ పంటల సాగును ప్రోత్సహిస్తే రైతులకు మంచి లాభసాటి ధరతోపాటు , వినియోగదారులకు కూడా అందుబాటు ధరల్లో తాజాకూరగాయలు లభిం చే అవకాశాలు మెరుగు పడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు

రాష్ట్రంలో జోన్ల వారీగా ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు, కూరగాయల సాగును సూక్ష్మ సేద్యంతో అనుసంధానం చేసి ప్రోత్సహిస్తోంది. 142పట్టణాలను ఎంపిక చేసి ఆ పట్టణాల పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తీర్ణ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోని పట్టణ సముదాయాలు, మున్సిపల్ కార్పోరేషన్లు , అధిక జనాభా కలిగిన పారిశ్రామిక వాడల చుట్టూ హైబ్రిడ్ కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రొత్సహిస్తోంది. కూరగాయల ఉత్పాదకతను మెరుగు పరచడం, రైతులకు గరిష్టంగా రాబడి లభించేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఏడాది పొడవునా వినియోగదారులకు కూరగాయలు , ఆకు కూరల లభ్యత ఉండేలా సమన్వయం చేస్తోంది. వినియోగదారులకు అవసరమైన 32రకాల కూరగాయలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు కూరగాయల పంటసాగులో పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పిస్తోంది. సన్న చిన్న కారు రైతులకు రాయితీలపై డ్రిప్ సదుపాయం కలుగజేస్తోంది. కూరగాయలు , ఆకు కూరాల సాగు కోసం రాష్ట్ర ఉద్యాన శాఖ రెండు హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద మేడ్చెల్ జిల్లాలోని జీడిమెట్లలో, సిద్దిపేట జిల్లాలోని ములుగులో వీటిని ఏర్పాటు చేసింది.

ఈ హెటెక్ నర్సరీ యూనిట్లలో టామాటా , వంకాయ, పచ్చిమిరప, క్యాబేజి, కాలిప్లవర్ తదితర రకాలకు చెందిన పంటల అధిక నాణ్యతకలిగిన నారు పెంచుతన్నారు. 90శాతం రాయితీపై ఈ నారు అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కూరగాయల విత్తన సహాయ పథకం కింద బెండతోపాటు తీగజాతికి చెందిన కూరగాయలు , బీన్స్ ,ఆకు కూరలకు సంబంధించిన విత్తనాల కొనుగోలుకు అయ్యే వ్యయంలో 50శాతం రాయితీని అందిస్తున్నట్టు తెలిపారు. పంట కోతల అనంతరం నష్టాలను తగ్గించడానికి కూరగాయల నిర్వహణ, రవాణాలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్లాస్టిక్ బుట్టల వినియోగానికి 50శాతం రాయితీతో బుట్టల సరఫరాకు నిధులు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News