Monday, January 20, 2025

కొండెక్కిన కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : కూరగాయలు ధరలు ఎన్నడూ లేని విధంగా భగ్గుమంటున్నాయని కొనుగోలు దారులు అంటున్నారు. గతంలో పచ్చి మిర్చి కిలో ధర 80 నుంచి 100, టమాటా కిలో ధర రూ. 60 నుంచి 80 ఉన్నాయని, ఎప్పుడు ఇంతా ధరలు లేవని రైతులు, కమిషన్ ఎజెంట్లు , అమ్మకం దారులు అంటున్నారు. తక్కువ ధరలు ఉండటం, కూలీలు కొరత , పెట్టుబడులు ఎక్కువ ఉండటంతో కూరగాయాలు పండించే రైతులు కూరగాయాలు పండించే రైతులు కూరగాయాల సాగుపై దృష్టి తగ్గించడం వల్ల ఈ ధరలు పెరిగాయి.

పేద మధ్య తరగతి కుటుంబాల వారు ప్రస్తుతం, టమాట, పచ్చిమిర్చి కోనే పరిస్థితిలో లేరు మిగతా కాయగూరలు, కిలో ధర 40 నుంచి 50 బీరకాయ, కాకరకాయ, దొండ, బెండ, వంకాయ తదితర కూరగాయలు కిలో రూ. 80 నుంచి 90 పట్టణంలో ఆదివారం అంగడిలో జరిగిన ధరలు ఇలా ఉన్నాయి. కూరగాయలు పండించే రైతులు కొంత మంది సంతోషం వ్యక్తం చేసిన దిగుబడి రావడం లేదు అని అధికంగా పండిన అప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరల్లో సగం ఉన్న రైతు అప్పులు తీరి సంతోషంగా ఉంటాం అని కూరగాయాలు పండించే రైతులు అంటున్నారు. ఏది ఏమైన ప్రస్తుతం కూరగాయాలు పండించే రైతు సంతోషంగా ఉన్నాడు. కొనుగోలు దారులు బాధపడుతున్నారు. గతంలో 5 మంది ఉన్న కుటుంబానికి వారానికి సరిపడా కూరగాయాలు రూ. 300 పెడితే సరిపోతుందని, ప్రస్తుతం ధరలతో వెయ్యి రూపాయలు పెట్టవాల్సి వస్తుందని అంటున్నారు.
ఆకు కూరలు సైతం మేము ఏమి తక్కువ కాదు: పాలకూర, తోట, మెంతం, గొంగూర, గంగవాయల తదితర ఆకుకూరలు ఒక కట్ట రూ. 10 ధర విక్రయిస్తున్నారు. గతంలో 10 రెండు కట్టలు ఇచ్చే వాళ్లు. కొత్తమీర పుదిన అంతే 10 ఒక కట్ట ఇలా కూరగాయాలు భగ్గుమంటున్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాల మాంసం తినే పరిస్థితులు లేక ఆకు కూరలతో సర్దుకు పరిస్థితి లేకుండా పోయిందని పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News