పెట్రోల్ @ రూ.105 … డీజిల్ రూ. 98… ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా వరుసగా పెరగుత్నున పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుని వంటింటి బడ్జెట్ తారుమారవుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ. 104.86 ఉండగా, డీజిల్ రూ. 97.96 చేరుకుంది. వీటి ప్రభావం నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పప్పుధాన్యాలపై పడుతుండటంతో సామాన్యుడిని నెల సరి వేతనం చేతికందకుండానే ఆవిరవుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్న కూరగాయాలపై పడుతుండటంతో వాటి ధరలు భగ్గుమంటున్నాయి. నగరానికి వచ్చే కూరగాయల్లో అధిక శాతం పొరుగు జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహరాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతు అవుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సకాలంలో వర్షాలుపడి పంటలు దిగబడి కూడా అధికంగా ఉంది. దీంతో అన్ని రకాల కూరగాయలు, పప్పుదినుసుల ధరలు కూడా తగ్గుతాయి. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
పంటలు దిగుమతి పెరిగినా పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ట్రాన్స్‌పోర్టు కూడా పెరిగాయి. వాటి భారం నిత్యావసర వస్తువులపై పడటంతో సామాన్య వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హొల్ సేల్ మార్కెట్‌లో టమాట రూ ః 16 ఉండగా, రిటైల్ మార్కెట్ రూ. 30 పలుకుతోంది. అదే విధంగా పచ్చి మిర్చి కిలో రూ ః 45 ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.60వరకు పలుకుతోంది. వీటిలో ట్రాన్స్‌పోర్టు చార్జీలు కూడా ఉండటంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటితో పాటు కంది పప్పుడు, వంట నూనేల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా వేతనాల్లో కోత విధించడంతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ పరిస్థితికి చేరుకుంటూ పూర్తి స్థాయిలో వేతనాలు అందుకుంటున్నామనే సంతోషాన్ని రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆవిరి చేస్తున్నాయి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ధరలు పెరుగుతుంటే నగరం జీవనం చాలా కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఇంధన ధరల పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం పడకుండా కొంత మేరకు ట్యాక్స్‌ను తగ్గించుకుని సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా చేశాయని అదే పద్దతిని ఇప్పుడు కూడా పాటించాలని పలువురు కోరుతున్నారు.