Monday, December 23, 2024

అష్టదేశ కాలసూచిక.. రాముడికి ఓ విశేష వాచ్ కానుక

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూరగాయాల చిరువ్యాపారి అద్బుతమే సృష్టించాడు. ఏకకాలంలో ఎనిమిది దేశాల్లోని సమయాన్ని తెలియచేసే విశేషరీతి గడియారాన్ని రూపొందించారు. అనిల్ కుమార్ సాహూ అనే 52 సంవత్సరాల ఈ లక్నో సబ్జీవాలా ఈ గడియారం తయారుచేసి, దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు అందించారు.

రామాలయ ప్రాణప్రతిష్ట దశలో ఇది తన నుంచి ట్రస్టుకు అందించిన చిరుకాల కానుక అని తెలిపారు. అక్టోబర్‌లో ఈ 75 సెంటిమీటర్ల వాచ్ తయారీ పని ఆరంభించాడు. నవరాత్రుల నేపథ్యంలో ఈ పనికిదిగి ఇటీవలే పూర్తి చేసి, రామాలయానికి అందించినట్లు వివరించారు. కూరగాయాల అమ్మకాల వృత్తిలో ఉండే సాహూ ప్రత్యేక తరహా గడియారాల రూపకల్పనలో దిట్ట. ఇంతకు ముందు ఆయన రూపొందించిన వాచ్‌లు లక్నోలోని ఖాటూశ్యామ్ ఆలయంలో, బారాబంకిలోని కోత్వాధామ్, కుంటేశ్వర్ మహాదేవ్ ఆలయాలలో కొలువు దీరి ఉన్నాయి.

లక్నోలోని కూరగాయల మండిలో ఆయన రూపొందించిన గోడగడియారం ప్రత్యేక ఆకర్షణ అయింది. ఇప్పుడు రామాయానికి అందించిన గడియారంలో భారతకాలమానం, దుబాయ్, జపాన్, రష్యా, చైనా , సింగపూర్, అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్‌ల్లో టైం తెలియచేస్తుంది. త్వరలోనే తాను పాతిక దేశాలలోని సమయాలను తెలియచేసే ఏకగడియారం తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. రాముడు కాలాతీతుడు, సార్వత్రికుడు అయినందున కాల వీక్షణ గడియారం రూపొందించి కానుకగా ఇచ్చినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News