Monday, December 23, 2024

దిగివచ్చిన కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

పెరిగిన దిగుబడి…
దిక్కు తోచని స్థితిలో రైతులు

Vegetables rates decreased

మనతెలంగాణ,సిటీబ్యూరో: ఒక వైపు పెరిగిన దిగుబడి ప్రభావం నగరంలోని రైతు బజార్ల మీద పడింది. నిన్న మొన్నటి దాకా ఆకాశాన్ని అంటిన ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒక్కొసారి పండిన అమ్ముడు పోక పొవడంతో గత్యంతరం లేని స్థితిలో వాటిని పశులకు దానాగా వాడుతున్నారు.నిన్న మొన్నటి దాక రూ. 60 నుంచి రూ.80 దాక ధర పలికిన టమాట నేడు కిలో రూ. 10 నుంచి రూ.15 పలుకుతోంది. అదే విధంగా రూ. 120 దాలక పలికిని మిర్చి కిలో . రూ. 10 నుంచి 15 పలుకుతోంది. ప్రభుత్వాలను గడగడలాడించి ఉల్లి ధర సైతం కిలో రూ. 20 పలుకుతోంది. ఈ విధంగా ఏ కూరగాయల ధరలు చూసి కిలో రూ. 20 నుంచి 25 పలకడం గమనార్హం. ఇప్పుడు సకాలంలో పంటలు చేతికి అందడంతో పంటల దిగుబడి కూడా పెరిగి పోయి వాటి రేట్లు ఆమాంతంగా పడిపోయాయి.ఉత్పత్తి పెరగడంతో కూరగయాల ధరలు వినియోగ దారులకు అందుబాటులో ఉన్నాయి.

వంకాయ,టమాట,బెండకాయ,సోరకాయ,బీర కాయ ఈ విధంగా నిత్యం అవసరం అయ్యే కూరగయాలన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. జూన్ నెలాఖరు వరకు కూరగయాలను ఉత్తర భారత దేశం నుంచి దిగుబడి చేసుకునే వాళ్ళమని అందుకే ధరలు మండి పోయాయని రైతు బజారు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నల్గొండ,ఖమ్మం, వరంగల్,రంగారెడ్డి ,మెదక్ జిల్లాల నుంచి కూరగాయలు బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్,మార్కెట్లకు తరలి వస్తుండటంతో ధరలు తక్కుముఖం పట్టాయి. నగర సరిహద్దు జిల్లాలో ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో పాలీహైస్( హరిత పందిరి) పంటలు కూడా మార్కెట్లకు వస్తున్నాయి. అదే విధంగా కర్నూలు,ఉభయ గోదారి,అనంతపురం,చిత్తూరు, జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మార్కెట్లను కూరగాయలను ముంచెత్తుతున్నాయి. దాంతో ధరలు సైతం ఒక్క సారిగా పడిపోయాయి.

నగర జనాభ సుమారు కోటి 30 లక్షలకు చేరింది. ఈ లెక్కన ప్రతి ఒక్కరు 350 నుంచి 500 గ్రాముల వరకు కూరగాయాలు ప్రతి రోజు వినియోగించాల్సి ఉంది. ఈ విధంగా 45 లక్షల కిలోల కూరగాయలు నగర ప్రజలకు అవసరం ఉండగా హొల్‌సేల్ మార్కెట్లకు 25 లక్షల కిలోల వరకు కూరగాయలు వస్తున్నాయి. మిగాతావి నేరుగా దుకాణాలకు చేరుతున్నాయి. వేసవి కాలంలో 10 నుంచి 20 లక్షల కిలో వరకు కూరగాయల కొరత నగరంలో ఉంది. గతంతో పోలిస్తే ఆ స్థాయిలో ఇప్పుడు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒక వైపు దిగుబడులు పెరిగి ధరలు అమాంతం పడిపోయి. కాని కాని కొన్ని కార్పోరేట్ సంస్థలు మాత్రం పంట దిగుబడులతో సంబంధం లేకుండా ప్రెష్ పేరుతో వినియోగ దారులను నిలువు దోపిడి చేస్తున్నాయనే విషయాన్ని తాము కూడా గుర్తించామని అధికారులు చెబుతున్నారు.
నగరంలోని పలు రైతు బజార్లలోని కూరగాయల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బీట్ రూట్ 1.కిలో రూ.23.00
టమాట 1.కిలో రూ.16.00
క్యారెట్ 1. కిలో రూ.28.00
ఆలుగడ్డ 1.కిలో రూ.23.00
వంకాయ 1.కిలో రూ.23.00
బీన్స్ 1కిలో రూ.35.00

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News