Monday, December 23, 2024

శాకాహార భోజనం ధరలు 10 శాతం పెరిగాయి

- Advertisement -
- Advertisement -

క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్, అనాల్సిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక
నిరుడు జూన్‌లో రూ. 26.70గా ఉంటే ఈ జూన్‌లో రూ. 29.40కి పెరిగిన వైనం
ఉల్లి, టమోటా, బంగాళాదుంపలు, బియ్యం, పప్పుల ధరల పెరుగుదలే కారణం

హైదరాబాద్ : శాకాహార భోజనం సగటు ధర జూన్‌లో పది శాతం పెరిగినట్లు శుక్రవారం క్రిసిల్ వెల్లడించిన తన నివేదికలో తెలియజేసింది. అయితే, క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్, అనాల్సిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక ప్రకారం,చికెన్ ధర తగ్గడం మాంసాహార భోజనం ధర తగ్గుదలకు దోహదం చేసిందని తెలిపింది. వెజ్ థాలీ ప్లేట్ సగటు ధర నిరుడు జూన్‌లో రూ. 26.70 కాగా, ఈ ఏడాది జూన్‌లో రూ. 29.40కి పెరిగింది. గత మేలో ఇది రూ. 27.80గా ఉంది. ఉల్లి, టమోటా, బంగాళాదుంపలు, బియ్యం, పప్పుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా నివేదిక పేర్కొన్నది. ఇక శాకాహారం థాలీ ధరల పెరుగుదలకు టమోటా ధరలు 30 శాతం, బంగాళాదుంపలు 59 శాతం, ఉల్లి 46 శాతం పెరగడం కారణంగా నివేదిక తెలిపింది.

రబీ విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో ఉల్లి దిగుబడి పడిపోయింది. మార్చిలో అకాల వర్షాల కారణంగా బంగాళాదుంపలు తక్కువ దిగుబడి సాధించినట్లు క్రిసిల్ నివేదిక తెలిపింది. కాగా, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లోని కీలక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవి పంటలో వైరస్ సోకడం వల్ల ఏడాదికి 35 శాతం టమోటా దిగుబడి తగ్గింది. ఇది టమోటా ధరల పెరుగుదలకు కారణమైందని నివేదిక వెల్లడించింది. అటు వరి సాగు తగ్గడంతో బియ్యం ధరల్లో 13 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. అదే విధంగా ఖరీఫ్ సీజన్‌లో సరిగ్గా వర్షాలు లేకపోవడంతో పప్పుల ధరలు 22 శాతం పెరిగాయని తెలిపింది. చికెన్ ధర 14 శాతం తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్‌లో రూ. 58కి దిగివచ్చింది. నిరుడు జూన్‌లో ఇది రూ. 60.50గా ఉంది. గత మే నెలల ఇది కేవలం రూ. 55.90గా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News