- Advertisement -
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాాదం జరిగింది. ఆదివారం రాత్రి కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన ఓ టెంపో వాహనం.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి డివైడర్ ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టో మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -