Saturday, April 5, 2025

లోయలో వాహనం బోల్తా… ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో మంగళవారం లోయలో వాహనం బోల్తాపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దోడా జిల్లా భదర్వా పఠాన్‌కోట్ రహదారిపై గుల్దండ సమీపంలో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. సంఘటన స్థలానికి పోలీస్‌లు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్యాసింజర్ వాహనం కధువా జిల్లా లోని బనీ ప్రాంతం నుంచి భదర్వాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్‌ఎస్పీ అబ్దుల్ ఖయూమ్ చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News