Sunday, January 19, 2025

పులి, మొసళ్లను తరలిస్తుండగా వాహనం బోల్తా…

- Advertisement -
- Advertisement -

నిర్మల్: వన్య ప్రాణులను జూపార్క్‌కు తరలిస్తుండగా ఒక వాహనం బోల్తా పడింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో జంతువులకు కాకపోవడంతో అటవీ శాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బిహార్ రాజధాని పాట్నాలోని సంజయ్ గాంధీ జాతీయ జూపార్క్ నుంచి వివిధ రకాల అడవి జంతువులను రెండు వాహనాల్లో బెంగళూరులోని బన్నేర్‌గట్ట జాతీయ పార్క్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘరియల్ జాతి మొసళ్లు, అరుదైన తెల్లపులి ఉందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఎనిమిది మొసళ్లలో రెండు బయటపడ్డాయి. వెంటనే అటవీ శాఖ అధికారులు మొసళ్లను బంధించి మరో వాహనంలో వాటిని తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News