Monday, December 23, 2024

శ్రీశైలంలో వాహనం బోల్తా: 15 మంది భక్తులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: భక్తులతో శ్రీశైలం వెళ్తున్న వాహనం బోల్తాపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సున్నివెంట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లా కోడమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన 25 మంది భక్తులు రెండు వాహనాల్లో శ్రీశైలం దేవస్థానానికి వెళ్లారు. శ్రీశైలానికి 15 కిలో మీటర్ల దూరంలో ఓ వాహనం బోల్తాపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News