Sunday, December 22, 2024

రంగు, రూపు మారుతున్న వాహన ఆర్సీ కార్డులు

- Advertisement -
- Advertisement -

ఏకీకతృ పౌర సేవల్లో భాగంగానే మారుస్తున్నాం
రవాణశాఖ అధికారులు


మన తెలంగాణ,సిటీబ్యూరో: వన్ నేషన్.. వన్ కార్డుల్లో భాగంగా వాహనాల్లో ఆర్సీ కార్డుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వాహన్ యాప్‌లో రవాణశాఖ అధికారులు భాగస్వామ్యం కావడంతో నూతన మార్పులతో కార్డులు వాహనాదారులు చేతికి అందనున్నాయి. అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఆర్సీ కార్డులు పలు ప్రింటింగ్ జాప్యం కారణంగా ప్రస్తుతం నూతన మార్పులతో కూడిని కార్డులు వాహనాదారులకు పూర్తి స్థాయిలో అందేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కార్డులును వాహనాదారులకు అందచేసిన అనంతరమే వాటిని వాహనాదారులకు అందచేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నూతన కార్డులకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలతో పాటు ప్రింటింగ్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయని వాటన్నింటిని సరిదిద్దుతున్నామని చెబుతున్నారు. అయితే నూతన కార్డుల విధానంలో లైట్ మోటార్ వెహికల్, మెటార్ సైకిల్ విత్ గేర్ అంటూ కార్డు వెనుకభాగంగా ఆరు కాల్‌మ్స్‌ను ముద్రించడంతో వాహనదారులు కొంత గందరగోళానికి లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదనపు కాలమ్స్ కార్డు సైజు కూడా పెరిగే అవకాశం ఉందని, ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉందని చెబుతున్నారు.
కేంద్ర మోటారు వాహన చట్టం అనుసరించి ఏకీకృత పౌర సేవల్లో భాగంగా డ్రౌవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీలు కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిలో భాగంగా ప్రస్తుతం సరికొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు,ఆర్సీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు తెలుపు రంగు కార్డుపై ఎరుపు రంగులో ముద్రించిన అక్షరాలతో కనిపించిన స్మార్టు కార్డులు ప్రస్తుతం లేత ఆకుపచ్చ,నీలి రంగుల్లో నలుపు అక్షరాలతో ఉన్న స్మార్టు కార్డులు అందుబాటులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేసేందుకు స్మార్టు కార్డులోల మార్పులు చేర్పులు చేశారు. కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్మార్టు కార్డులను అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు స్మార్టు కార్డులు ముద్రించే అక్షరాల సైజు కూడా పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే నమూనాల ఉండే విధంగా వీటిని రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News