Friday, November 22, 2024

చకచకా వాహనాల రిజిస్ట్రేషన్ల

- Advertisement -
- Advertisement -

Vehicle registrations increased from 2000 to 3500 per day

కరోనాతో పెరిగిన వ్యక్తిగత వాహనాల సంఖ్య
రోజుకు 2000 నుంచి 3500 వరకు పెరిగిన వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య

హైదరాబాద్: నగరంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న వాహనా సంఖ్యను గురించి చెప్పుకోవాలంటే లాక్ డౌన్‌కు ముందు వెనుక అని ప్రారంభించాల్సి వస్తుంది. లాక్ డౌన్‌ముందు ప్రయాణికులు ఆర్‌టిసి, ఎంఎంటిఎస్‌లతో పాటు ప్రైవేట్ ప్రజారవాణా వ్యవస్థ అయిన మెట్రో, క్యాబ్స్, ఆటోలను, ఇతర అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రోజు వారి తమ పనునలు చక్కబెట్టుకునేవారు. కాని కొవిడ్ 19 అనంతర పరిస్థితులు కారణంగా లాక్‌డౌన్ విధించడం కరోనా నిబంధనల్లో భాగమైన సామాజిక దూరంగా పాటించాల్సి రావడంతో వారి దృష్టి వ్య క్తిగత వాహనాల కొనుగోలుపై పడింది. దీంతో సాధారణ రోజుల్లో రవాణాశాలో గ్రేటర్ పరిధిలో సుమారు ప్రతి రోజు 1500 నుంచి 2000 వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. కాని కొవిడ్ పరిస్థితులను పూర్తిగా మార్చివేయడంతో ఇంతకాలం అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థను సద్వినియోగం చేసుకునే ప్రయాణికులు అప్పు చేసైనా సొంత వాహనాలను కొనుగోలు చేయడంతో రవాణాశాఖలో రోజువారీ వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య 2000 నుంచి 3500 పెరిగింది. దాంతో పాటు కొంతమంది ఇంత కా లంలో పక్కన పెట్టిన వాహనాలు కూడా ఉపయోగించడంతో గ్రేటర్‌లో ట్రాఫిక్ కూడా అనూహ్యంగా పెరిగింది.

ప్రజలు ఆరోగ్యంపై కరోనా తీవ్ర ప్రభావం చూపడంతో వాహనాల సంఖ్య పెరిగేందుకు కారమైందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో జనాలతో కలిసి ప్రయాణించేందుకు వారు లేరని కరోనా వ్యాధికి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆటోలు బస్సుల్లో ప్రయాణించాలంటే నగర ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సొంత వాహనాల్లోనే ప్రయాణించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా నగరంలో ద్విచక్రవాహనాల కొనుగోళ్ళతో కార్ల కొనుగోళ్ళు రిజిస్ట్రేషన్ కూడా బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక స్థోమతను బట్టి కొంత మంది కొత్త వాహనాలను కొనుగోలు చేస్తుంటే మరి కొంత మంది సెకండ్‌హ్యాండ్ వాహనాలను కొనుగోళ్ళపై దృష్టి పెడుతున్నారు. దీంతో వాహనాల యాజమాన్య మార్పిడి సంబంధించిన పనులు కూడా రవాణాశాఖ కార్యాలయాల్లో అధికంగా జరుగుతున్నాయంటున్నారు.

దీంతో నగరంలో వాహనాల సంఖ్య పెరగడంతో వాహనాల వినియోగం అంచాలను మించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దాంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు కూడా అధికం అయ్యాయి. నియంత్రించేందుకు కూడా అవకాశం లేకుండా వాహనాలు పెరిగిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రతి సిగ్నల్ వద్ద నిమిషాల తరబడి వాహనాలను నిలిచి ఉండటంతో అటు ట్రాఫిక్ పెరగడంతో పాటు వాహనాలను నుంచి వచ్చే కాలుష్యం కూడా అధికమైంది. దీంతో నగరంలో కాలుష్యం కూడా సాధారణ స్థాయిని మించిపోయే అవకాశం లేకపోదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా ఈ అంశంపై అటు రవాణా, ఇటు ట్రాఫిక్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకుపోతే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులను నుంచి తప్పించుకోగలుతాం లేకపోతే ఇక్కడ కూడా సరి బేసి విధానంలో రోడ్డు మీదకు వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News