Thursday, January 23, 2025

జూలైలో వాహనాల రిటైల్ సేల్స్

- Advertisement -
- Advertisement -

Vehicle retail sales skid 8 percent in July

8 శాతం తగ్గాయి:  ఫడా వెల్లడి

న్యూఢిల్లీ : దేశీయంగా వాహనాల రిటైల్ అమ్మకాలు జూలై నెలలో 8 శాతం తగ్గాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత నెలలో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. 2021 జూలైలో 15.59 లక్షల వాహనాలతో పోలిస్తే 2022 జూలైలో కేవలం 14.36 లక్షల వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆటోమొబైల్ రంగంలో ఇంకా కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌లో క్షీణత కారణంగా జూలైలో వాహనాల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 8 శాతం తగ్గాయి. ఆటో డీలర్స్ బాడీ ఫడా ఈ సమాచారాన్ని ఇచ్చింది. ప్యాసింజర్ వాహనాల(పివి) రిటైల్ అమ్మకాలు 2021 జూలైలో 2,63,238 యూనిట్ల నుండి 2022 జూలైలో 5 శాతం తగ్గి 2,50,972 యూనిట్లకు పడిపోయాయి. ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు 11 శాతం తగ్గాయి. గత నెలలో త్రీవీలర్ వాహనాలు, వాణిజ్య వాహనాల రిటైల్ అమ్మకాలు వార్షికంగా పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News