హయత్‌నగర్‌ః సులభంగా డబ్బుసంపాదనకు అలవాటు పట్ట ఓ ప్రబుద్దుడు చివరికి కటకటాల పాలైయ్యాడు. చదివింది 9వ తరగతి అయిన మెదడుకు పదను పెట్టిన అతడు అందరి బురిడి కొట్టిస్తూ కోట్ల విలువ చేసే విలువైన వాహనాలను సులభంగా అమ్ముతూ కోట్లను కొల్లగొట్టాడు. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి ఎస్‌ఓటి, వనస్థలీపురం, హయత్‌నగర్ పోలీసులు జాయింట్ అపరేషన్‌తో హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణానికి చెందిన కరుమురి వీర వెంకట సత్య గుప్త అలీయాస్ నాగరాజు 2015 సంవత్సరంలో నగరానికి వలస వచ్చి సప్లయింగ్ అఫ్ ఫాస్ట్ కస్టమర్ గూడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇదేక్రమంలో 2018లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ద్వార లోన్ తీసుకొని కారు కొనుగోలు చేశాడు. లోన్ చెల్లింపు పూర్తి కాకుండానే ఫేక్ ఎన్‌ఓసీ సృష్టించి ఖైరతాబాద్ అర్‌టిఏ కార్యాలయంలో హై పోతికేటేడ్ లేకుండ కారును తన పేరు మీదకు మార్చుకుని దానిని బహిరంగంగా మార్కెట్‌లో అమ్మి వచ్చిన డబ్బుతో మరో కారు కొనుగోలు చేసినట్లు డిసిపి తెలిపారు. ఈ తరహా మోసాలకు అలవాటు పడ్డ నిం దుతుడు నకిలి స్టాంపులను సృష్టించి విశాఖపట్నానికి చెందిన శ్రావణి, నాగభూషణం, సంతోష్‌కుమార్, లక్ష్మికాంత్‌ల సహయంతో ఇలా ఏకంగా 9 వాహనాలను అమ్మకానికి పెట్టాడు.
విశ్వసనీయ సమచారంతో పోలీసులు నాగరాజును పట్టుకుని అతని వద్ద నుండి 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 1.26 కోట్ల విలువ ఉంటుందని డిసిపి తెలిపారు. నాగరాజ్ కు గతంలో మీడియాలో పని చేసిన అనుభవం కూడ ఉందని, గతంలో వనస్థలీపురం పోలీస్ స్టెషన్‌లో అతనిపై కేసు కూడ నమోదైందన్నారు. ఈకార్యక్రమంలో హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్‌స్టెక్టర్ జలందర్, భవనగిరి ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఎస్‌ఐలు నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.