- Advertisement -
హైదరాబాద్: దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే వాహనాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రవాణా వాహనాలకు సంబంధించిన డీలర్లు, జిల్లా రవాణా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకంలో సుమారు 40శాతం మంది లబ్ధిదారులకు రవాణా వాహనాలను ఎంపిక చేసుకున్నారు. వాహానాలను త్వరితగతిన లబ్దిదారులకు అందజేయాలని వాటికి సంబంధించిన ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారిస్తానని వివిధ కంపెనీలకు సంబంధించిన డీలర్లను కోరారు. ఈసమావేశంలో జిల్లా రవాణా అధికారి రామచంద్రా, ఎస్సీ కార్పొరేషన్ ఇడి రమేష్, వివిధ కంపెనీలకు చెందిన డీలర్లు పాల్గొన్నారు.
- Advertisement -