Thursday, December 19, 2024

సరైన డాక్యుమెంట్లు లేకపోతే రేపు మీ వాహనాలు సీజ్

- Advertisement -
- Advertisement -

పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈమేరకు పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఒక వీడియో రిలీజ్ చేశారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సి), డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్సు వంటి పత్రాలతోపాటు నంబర్ ప్లేట్ కూడా సరిగ్గా కనిపించేటట్లు ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇవి లేకపోతే వాహనాలను సీజ్ చేసి, పోలింగ్ మరునాడు తిరిగి అప్పగిస్తామని పేర్కొన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు తోడ్పడాలని ఆయన వివిధ పార్టీల నాయకులను, ప్రజలనూ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News