Monday, December 23, 2024

ఎసిబి వలలో వెల్దండ ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా, వెల్దండ ఎస్‌ఐ రవి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి సమీపంలోని ఓ స్టోన్ క్రషర్ వద్ద వారం రోజుల క్రితం జిలెటిన్ స్టిక్స్ దొంగతనం జరిగింది. ఈ విషయంలో ఈ నెల 17న ఎస్‌ఐ నలుగురి దొంగలను పట్టుకుని రిమాండ్‌కు పంపారు. పట్టుబడ్డ వ్యక్తులు దొంగతనం చేసిన జిలెటిన్ స్టిక్స్‌ను ఆమనగల్, కల్వకుర్తి, ఊర్కొండ పేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు అమ్మారు. విచారణ పేరుతో వారిని స్టేషన్‌కి పిలిపించారు. ఈ క్రమంలో కల్వకుర్తి పట్టణానికి చెందిన డేరంగుల వెంకటేష్‌తో పాటు ఆమనగలు, ఊర్కోండ పేటకు చెందిన వారిని డబ్బులు ఇవ్వాలని ఎస్‌ఐ చేసినట్లు సమాచారం.

రెండు లక్షలు ఇవ్వాల్సిందే…
జిలెటిన్ స్టిక్స్ దొంగతనం విషయంలో ఎస్‌ఐ రవి కల్వకుర్తికి చెందిన డేరంగుల వెంకటేష్‌ని రెండు లక్షలు ఇవ్వాలని బెదిరించాడని బాధితుడు వెంకటేష్ పేర్కొన్నారు. రూ.50 వేలు ఇస్తానని పేర్కొన్న వెంకటేష్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో రెండు బృందాలుగా విడిపోయిన ఎసిబి అధికారులు ఎస్‌ఐ సూచించిన వ్యక్తికి కల్వకుర్తిలో డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. బుధవారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఎస్‌ఐని పోలీస్ స్టేషన్‌లో ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా వెల్దండలో పనిచేసిన ఓ ఎస్‌ఐ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.

ఎవరీ.. 102 డ్రైవర్ విక్రమ్
జిలెటిన్ స్టిక్స్ దొంగతనం విషయంలో లంచంగా అడిగిన రూ.50 వేల రూపాయలను మధ్యవర్తి విక్రమ్‌కి ఇవ్వాలని ఎస్‌ఐ రవి అడిగారు. గతంలో సారగొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో 102 డ్రైవర్‌గా పనిచేస్తున్న విక్రమ్ పరిచయమయ్యాడని సమాచారం. విక్రమ్ మధ్యవర్తిగా ఉన్నాడు. ఎస్‌ఐ రవి గతంలో ఏమైనా ఆర్థిక అవినీతికి పాల్పడ్డాడనే కోణంలో ఎసిబి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News