- Advertisement -
నాగర్ కర్నూల్: లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఎసిబి అధికారులు పట్టుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సబ్ డివిజన్ వెల్దండ మండలంలో జరిగింది. తిలక్ నగర్ చెందిన వెంకటేశ్ ఇంట్లో ఈ నెల 17న జిలిటిన్ స్టిక్స్ ను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు వెంకటేశ్ ను 50వేలు లంచం ఇవ్వాలని వెల్దండ ఎస్ఐ రవి డిమాండ్ చేశాడు. ఎస్ఐ సూచనతో అంబులెన్స్ డ్రైవర్ కు 50వేలు ఇస్తుండగా ఎసిబి డిఎస్పీ కృష్ణ గౌడ్ పట్టుకున్నాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ రవిని అరెస్టు చేసినట్లు సమాచారం.
- Advertisement -