Monday, January 20, 2025

భారీ వర్షానికి జలమయమైన వేల్పూర్

- Advertisement -
- Advertisement -

వేల్పూర్: నిజామాబాద్ జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వేల్పూర్ మండలంలో ఏకధాటిగా 5 గంటల భారీ వర్షం కురవడంతో వేల్పూర్ బీసీ కాలనీ ఏరియాలో ఉన్న ఇళ్లలోకి వర్షపునీరు దూసుకొచ్చింది. వేల్పూర్ రామన్నపేట్ వెళ్లే రోడ్డు మార్గంలో మోతే ఏరియాలో కళ్ళు గుడిసె వద్ద పాత కల్వర్టు తెగిపోవడంతో రామన్నపేట్ వేల్పూర్ కు వెళ్లే రోడ్డు మార్గనికి అంతరాయం కలిగింది. మండలం లోని వెంకటాపూర్ కోమన్ పల్లి మధ్యలో కల్వటు పై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వేల్పూర్ మురుసుకుంట చెరువు కట్ట తెగిపోవడంతో వేల్పూరుకు వెళ్లే రోడ్డు పైకి నీరు రావడంతో సెంటర్ లైటింగ్ కల్వర్టు పైనుంచి నీరు పారి వీడీసీ భవనము, మైనారిటీ మదరస, స్థానిక పోలీస్ స్టేషన్ స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ కు వర్షపు నీరు చేరింది. వేల్పూర్ మైనార్టీ మధురసాలోని చదువుతున్న విద్యార్థులను గ్రామపంచాయతీ సిబ్బంది వీడిసి సభ్యులు సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. వేల్పూర్ లోని కాడుచెరువు కట్ట తెగిపోవడంతో పంట పొలంలోకి నీరు ప్రవహిస్తోంది. వేల్పూర్ లో కురిసిన భారీ వర్షానికి మరుసుకుంట చెరువు, కార్డు చెరువు కట్టలు తెగిపోవడంతో 11 బైకులు కొట్టుకపోయాయి. 63వ జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరడంతో లక్కోర శివారులో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. లక్కోర గ్రామంలోని 63వ జాతీయ పై నిర్మించిన కల్వర్టు వర్షపు నీరు ప్రవాహానికి కృంగిపోయి మట్టి కొట్టుకుపోవడంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News