Sunday, April 13, 2025

మాజ్రీ క్రికెటర్ కన్నుమూత…. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంతాపం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రా రంజీ టీమ్ మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యచేంద్ర(94) కన్నుమూశారు. 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చి జట్టుతో మ్యాచ్‌తో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించారు. క్రికెట్‌లో లెగ్ స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్ చేసేవారు. రాజగోపాల్ 15 రంజీ మ్యాచ్‌లు ఆడారు. 1963 నుంచి 1965 వరకు ఆంధ్రా జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు. తిరుపతిలోని వెంకటగిరి రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రాజగోపాల్ మృతి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తిరుపతిలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News