Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డివి మతిలేని మరుగుజ్జు మాటలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమర జ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందని మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డివి మతిలేని మరుగుజ్జు మాటలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ భారత స్వాతంత్ర అమరులకు ఒక స్మారకాన్ని ఢిల్లీలో ఎందుకు కట్టలేదని, కెసిఆర్, కెటిఆర్‌ను వ్యక్తిగతంగా తిడితే వార్తల్లో ఉంటానన్న ఆరాటం రేవంత్‌దని ప్రశాంత్‌రెడ్డి ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు.

బ్లాక్ మెయిలర్ రేవంత్‌తో నీతులు చెప్పించు కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. రేవంత్‌కు అమరవీరుల గురించి మాట్లాడితే వారి ఆత్మలు ఘోషిస్తాయని, అమరుల త్యాగాల గురించి తనకే తెలుసని మంత్రి వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి వేముల హెచ్చరించారు. ఒకసారి రేవంత్ రెడ్డి 6 అంతస్థుల అమర జ్యోతి సందర్శించి అక్కడ ఏర్పాట్లు చూస్తే ఆ నిర్మాణం గొప్పతనం అర్థమవుతుందని మంత్రి వేముల సూచించారు.

తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మంత్రి తేల్చి చెప్పారు. అసలు అమరుల బలిదానాలు జరిగిందే కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం, గందరగోళ ప్రకటనల వల్ల అని వేముల విమర్శించారు. చంపిందే సోనియా గాంధీ అని 2004లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, మాట ఇచ్చి కామన్ మినిమం ప్రోగ్రాం(సిఎంపి)లో పెట్టి మాట తప్పారని ఆయన ఆరోపించారు. 2009 డిసెంబర్ 9వ తేదీన ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్నారని, అందుకే బలిదానాలు అయ్యాయని మంత్రి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News