Thursday, January 23, 2025

మరో వెయ్యి మందిని రప్పించండి

- Advertisement -
- Advertisement -

సచివాలయ నిర్మాణ పనుల వేగవంతానికి
నిపుణులైన కార్మికులను సమకూర్చుకోండి

దూల్పూర్ రెడ్ శాండ్ స్టోన్
నిర్మాణ పనులకు రాజస్థాన్
నుంచి ప్రత్యేకంగా
50మంది మేస్త్రీలు
త్వరితగతిన మిగతా
డోమ్‌ల పనులు
గుడి, మసీదు, చర్చి
భవంతుల పనుల్లో వేగం
పెంచాలి ఏజెన్సీకి
మంత్రి వేముల సూచనలు
సిఎం కెసిఆర్ ఆదేశాల
మేరకు ప్రతి పనిని క్షుణ్ణంగా
పరిశీలించిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఆదివారం దాదాపు 4 గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ నిర్మాణంలో ఉన్న ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. దూల్పూర్ రెడ్ స్టోన్ రాతి కట్టడం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని దానికి తగ్గట్టు వర్క్ ఫోర్స్ డబుల్ చేయాలని వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. దూల్పూర్ రెడ్ సాండ్ స్టోన్ రాతి కట్టడం నిర్మాణ పనుల కోసం రాజస్థాన్ నుంచి 50 మంది మేస్త్రీలను ప్రత్యేకంగా రప్పించాలని ఏజెన్సీని ఆదేశించారు. ఎలివేషన్ వచ్చే జిఆర్‌సి క్లాడింగ్ పనుల నిపుణులను వెంటనే తెప్పించి రౌండ్ ఫిల్లర్ల నగిషీల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రానైట్, ఫ్లోరింగ్ పనుల్లో ఇంకా వేగం పెంచాలన్నారు. యుపివిసి విండో పనులు,ఫాల్ సీలింగ్ పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌తో పాటు మిగిలిన సివిల్ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు.

ఈ పనులన్నీ సమాంతరంగా జరిగేలా ఆర్‌అండ్‌బి ఇంజనీర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్‌కి వచ్చే రేయిలింగ్ పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. 32 డోము నిర్మాణాలకు గాను 16 డోముల నిర్మాణం పూర్తయిందని, మరో 8 డోముల స్ట్రక్చరల్ పనులు పూర్తి కాగా మిగతా డోముల నిర్మాణాలు కూడా తొందరగా చేపట్టాలన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ నిర్మాణం కోసం 1450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరో వేయి మంది నైపుణ్యం కలిగిన కార్మికులను వెంటనే సమకూర్చుకోవాలి అని ఏజెన్సీ ని మంత్రి ఆదేశించారు. సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణంలోని ప్రార్ధన మందిరాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. గుడి, సెక్యూరిటీ బ్లాక్, బిల్డింగ్‌ల పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News