- Advertisement -
అసెంబ్లీ ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్ రేవంత్ ప్రభుత్వం మార్చింది. ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూంను కేటాయించింది. మొదటి ఆసెంబ్లీ సమావేశాల్లో కెసిఆర్‌కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి రెండో సమావేశాల్లోపే మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. దీనిపై బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
ప్రతిపక్ష నేతలకు ఇంతకు ముందు ఎంత స్థలంలో ఆఫీస్ ఉన్నదో అంతే స్థలంలో ఆఫీస్ కేటాయించాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ వాహనాలు, సెక్యూరిటీ ఇస్తున్నారు కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వటం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఏం జరిగినా పర్వాలేదన్నట్టు వాళ్ల ఉద్దేశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -