Monday, December 23, 2024

నిమ్స్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనులను ఆదివారం ఉదయం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్‌కు నిర్మాణ ప్రాంగణ వెలుపల ఉన్న రోడ్డు, ఫుట్‌పాత్‌లు, పలు సుందరీకరణ అంశాలకు సంబంధించి పలు సూచనలు మంత్రి చేశారు. అనంతరం ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మించే నిమ్స్ హాస్పిటల్ భవనానికి ఈ నెల 14వ తేదీన సిఎం శంకుస్థాపన చేయనుండగా దానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ప్రాంగణమంతా కలియ తిరిగారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ అండ్ బి శాఖ తరుపున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్‌ఈ హఫీజ్, ఈఈ శశిధర్, డిఈ మోహన్, మాధవి, నిమ్స్ డైరెక్టర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News