Monday, January 20, 2025

గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ: వేముల ప్రశాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం ఉదయం మత్రి మీడియాతో మాట్లాడుతూ.. దరఖాస్తు గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దరఖాస్తుదారులు ప్రజాప్రతినిధులతో కలెక్టర్ కు దరఖాస్తులు పంపించవచ్చు పేర్కొన్నారు. గ్రామకంఠంలోని పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో మూడు వేల ఇళ్లు మాత్రమే ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మూడు వేల ఇళ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. దశలవారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మీ పథకం అమలు అవుతుందని తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News