నిజామాబాద్: జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదిక వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. టిఆర్ఎస్ శ్రేణులు, రైతులు, మహిళలతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ”పేదలు, రైతుల బాధలు తీర్చడం కోసం పుట్టిన నాయకుడు కేసీఆర్. ఈ రాష్ట్రానికి, దేశానికి ఆయన సేవలు అవసరం. సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని టిఆర్ఎస్ కార్యకర్తగా నేను కోరుకుంటున్నారు. కెసిఆర్ లాంటి వ్యక్తి యుగానికి ఒక్కడు పుడతాడు..ఆయన కారణజన్ముడు. తెలంగాణ కోసం 2001లో ఒక్కడే బయలుదేరిండు. అప్పుడు కౌరవ సైన్యం అంత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఉన్నా కేసీఆర్ బయపడలేదు. ఆయన వెంట బయలుదేరిన అతికొద్ది మందిలో మా తండ్రి సురేందర్ రెడ్డి ఒకరు. నిరాహారదీక్ష చేపట్టి, చవు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించాడు. 2014 ఎన్నికల్లో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లనే ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించారు. ఆంధ్ర పాలకుల కాలంలో లేనివి ఈ ఏడు ఏండ్లలో చేసి చూపించారు కేసీఆర్. తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ దేశనికి నాయకత్వం వహించాలి. ఆయన ప్రధాని కావాలి” అని పేర్కొన్నారు.
Vemula Prashanth Reddy Birthday Wishes CM KCR